Home » Mahesh Kumar Goud
Telangana: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమయ్యిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ వున్నారని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా ఇస్తూ సర్కార్‌కు సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండే అని.. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుంటే ఎలా ? అంటూ నిలదీశారు. రాజకీయాలను పక్కన పెట్టి సాయం చెయ్యాల్సిన సోయి లేదా అంటూ మండిపడ్డారు.
టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు..? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీకాలం అయిపోయినంత వరకూ నడిచిన.. ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయ్..! అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది.. ఇదిగో ఈయనే కన్ఫామ్ అయ్యారని లెక్కలేనన్ని వార్తలు.. అంతకుమించి పుకార్లు షికార్లు చేశాయ్..! ఆశావహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా..? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పరిస్థితి..