Home » Mamata Banerjee
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలు హత్యాచార ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అవి నేటికి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనల నుంచి దుర్గా పూజల వైపు దృష్టి మరలించాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రజలకు సీఎం మమతా బెనర్జీ సూచించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసు దర్యాప్తునకు సంబంధించి సీబీఐ సోమవారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఇప్పటికీ ఆర్ జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటనతోపాటు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి.
కోల్‌కతా ఆర్ జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు గ్యాంగ్ రేప్ జరిగి ఉండవచ్చనే అనుమానాలు రేకెత్తాయి.
ఆర్జీ కర్ హాస్పిటల్ కేసు విషయంలో సీఎం మమతా బెనర్జీ మొబైల్ ఫోన్ తీసుకుని ఆగస్ట్ 9, 10 తేదీల్లో కాల్ రికార్డులను తనిఖీ చేయాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. అప్పుడు అన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. అంతేకాదు నిజానిజాలు తెలియాలంటే ముందుగా సీఎంను విచారించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాకెట్ ఛటర్జీ డిమాండ్ చేశారు.
ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద విధుల నిర్వహణలో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించింది.
అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో మంగళవారంనాడు ప్రవేశపెట్టారు. ఇది 'చరిత్రాత్మిక బిల్లు' అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్లో ట్రయినీ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన 'అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ బిల్లు (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ ఎమెండమెంట్)-2024ను బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై అరెస్టయిన మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌కు కోర్టు 8 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. ఈ మేరకు కోల్‌కతాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు మరణదండన విధించేందుకు ఉద్దేశించిన బిల్లును పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమోదించనుంది. ఇందుకోసం సోమవారంనాడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రతిపాదిత బిల్లుకు ''అపరాజిత ఉమన్ అండ్ చైల్డ్ (వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండమెంట్) బిల్లు 2024''గా పేరు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.