Online Betting Games.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
ABN , Publish Date - Apr 10 , 2025 | 10:45 AM
తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.

కాకినాడ జిల్లా: బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లకు (Online betting games) అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడడం.. అందుకోసం లోన్ యాప్ (Loan Apps)లలో, మైక్రో ఫైనాన్స్ (Micro finance) సంస్థల్లో అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చలేక.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ జాడ్యం అన్ని ప్రాంతాలకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా సాంకేతికత (Social Media).. సెల్‌ఫోన్లు (Cell Phones) వాడకం పెరిగాక.. యువతలో ఈ విష సంస్కృతి పెరిగింది.
Also Read..: శాంతి చర్చలపై మావోయిస్టు పార్టీ తాజా స్పందన
తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఉచ్చులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెంకు చెందిన సింగిరి మళ్ళ సూరిబాబు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అతనిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడి రూ. 1 కోటి 40 లక్షలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం బాధితుడు కాకినాడ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సూరిబాబు రామన్నపాలెంలో షాపు నడుపుకుంటున్నాడు. ఇటీవల భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో బ్యాంకు రమ్మీ గేమ్స్ ఆడాడు. దీంతో అకౌంట్‌లో ఉన్న కోటి నలభై లక్షలు సొమ్మును ఆన్ లైన్ రమ్మీ బెట్టింగ్ గేమ్స్ ఆడి పోగొట్టుకున్నాడు. ఇంట్లో శుభకార్యం నిమిత్తం రూ.5 లక్షలు బ్యాంక్ నుండి తీసుకురమ్మని కుటుంబ సభ్యులు చెప్పగా.. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతున్న సూరిబాబు ఆరోగ్యం మెరుగైనట్లు తెలియవచ్చింది.
కాగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకున్న వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొందరు ఆ అప్పులు తీర్చేందుకు దొడ్డిదారులు వెతుక్కుంటున్నారు. గంజాయి, డ్రగ్స్ కోసం దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్‌లు తొలుత సరదాగా మొదలై చివరికది వ్యసనంగా మారుతున్నాయి. ఆ ఉచ్చులోంచి బయటపడలేక ఏదో ఒక రోజు గెలుస్తామని సమాధానం చెప్పుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, హోటళ్లు, టీకేఫ్‌లు, పార్కులు, క్రీడామైదానాలు ఇలా ఎక్కడబడితే అక్కడ యువత, విద్యార్థులు పనులు మానుకుని మరీ గంటలసేపు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోయి గొడవలకు దిగుతున్నారు. ఇలాంటిచోట పోలీసులు నిఘా పెంచితే కొంతవరకైనా ఫలితం ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కీలక దశకు మంత్రి లోకేష్ కేసు..
తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు..
For More AP News and Telugu News