Home » MLA
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్ర మణలకు హద్దేలేకుండాపోయిందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరి లో సోమవారం ప్రజా రెవెన్యూ దర్బార్-భూసమస్యల పరిష్కార వేదిక నిర్వహించా రు. ధర్మవరం ఆర్డీఓ మహేశ, మండల రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని రైతుల నుంచి అర్జీలను ీస్వీకరించారు.
తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్న దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ ఇలవేల్పుగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి రీల్స్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కూటమి ప్రభుత్వ పాలనలో పథకాలతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.
శింగనమల చెరువు మరవ వద్ద ప్రమాణి కులకు ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సీఎం చంద్రబాబు నాయుడును కో రారు. ఆమె ఆదివారం మంగ ళగిరిలోని టీడీపీ కార్యాల యంలో సీఎం చంద్రబాబును కలసి, నియోజకవర్గంలో చేప ట్టవలసిన అభివృద్ధి పనులపై విన్నవించారు.
వైసీపీ హయాంలో జా నెడు రోడ్డు వేయలేకపోయినా.. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటేవని ఎమ్మెల్యే పరిటాల సునీ త ఘాటుగా విమర్శించారు. మండలం లోని ఆలమూరులో ఆదివారం మధ్యా హ్నం పల్లె పండుగ వారోత్సవాల కార్యక్ర మంలో భాగంగా సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఆరోగ్యశ్రీ పథకం అమలవు తున్నా డబ్బులు చెల్లించాల్సిందేనని అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రి యాజమాన్యం బాధితులను డిమాండ్ చేస్తోందిని ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఫిర్యాదులు వచ్చాయి. మండలంలోని గంగంపల్లికి ఎమ్మెల్యే శనివారం వెళ్లినప్పుడు... ఆ గ్రామానికి చెందిన బాధితుడు శ్రీకాంత తల్లి గోవిందమ్మ అనే మహిళ తన గోడు వెళ్లబోసుకున్నారు.
గ్రామాల్లో ఏ పనులు చేయాలో నిర్ణయించాల్సింది ఆ గ్రామస్థులే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని గంగంపల్లి తండాలో శనివారం పల్లెపండుగ కార్యక్ర మంలో ఆమె పాల్గొని సీసీరోడ్లకు భూమిపూజచేశారు. నసనకోట పంచా యతీ గంగంపల్లి ఎీస్సీకాలనీలో ఎనఆర్జీఎస్ నిధులు రూ.20లక్షలు, జడ్పీ నిధులు రూ.48లక్షలతో సీసీరోడ్లకు భూమిపూజ చేశారు.
తెలంగాణలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ కాల్ చేయడం సంచలనం రేపుతోంది. ఈనెల 14వ తేదీన జరిగిన ఘటన ఎమ్మెల్యే ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో మహిళలు కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి మరీ.. వారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు ..