Share News

AP News: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నాగబాబు, సోము వీర్రాజు

ABN , Publish Date - Apr 02 , 2025 | 02:02 PM

కూటమి ప్రభుత్వంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపికైన జనసేన నుంచి కొణిదల నాగేంద్ర రావు (నాగబాబు), బీజేపీ నుంచి సీనియర్ నేత సోము వీర్రాజులు బుధవారం శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

AP News: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నాగబాబు, సోము వీర్రాజు
Konidela Nagendra Rao, Somu Veerraju

అమరావతి: ఏపీ శాసనమండలి (Andhra Pradesh Legislative Council) సభ్యులుగా ఎన్నికైన జనసేన పార్టీ నేత (Janasena Leader) కొణిదల నాగేంద్ర రావు (నాగబాబు) (Konidela Nagendra Rao) సతీ సమేతంగా మండలి చైర్మన్ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అలాగే బీజేపీ నేత (BJP Leader) సోము వీర్రాజు (Somu Veerraju) కూడా కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ ఇద్దరు నేతలు మండలి చైర్మన్ మోషేన్ రాజు (Council Chairman Moshen Raju) సమక్షంలో ఎమ్మెల్సీలు (MLC)గా ప్రమాణ స్వీకారం (Oath Ceremony)చేశారు.

Also Read..: కనిగిరి నియోజకవర్గంలో సీబీజీ ఫ్లాంట్‌కు మంత్రి లోకేష్‌ భూమి పూజ


ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలు ఆయనను గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి, ఇతర నాయకులు శాలువా, పూలదండలతో సోము వీర్రాజును సత్కరించారు.


ఏపీలో బీజేపీకి మంచి రోజులు..

ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి మాట్లాడుతూ.. సోము వీర్రాజు రెండో సారి ఎమ్మెల్సీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఇది‌ బీజేపీలో ఒక చారిత్రక విషయంగా ఆయన పేర్కొన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా సోము వీర్రాజుకు అవకాశం వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఎమ్మెల్సీ సీటు బీజేపీకి కేటాయించారన్నారు. రాష్ట్రంలో పార్టీని అభివృద్ధి చేసిన సోము వీర్రాజు సేవలను అధిష్టానం గుర్తించిందన్నారు. అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు ఎక్కువుగా ఉన్నా... మండలిలో వైసీపీ సభ్యులే ఎక్కువగా ఉన్నారన్నారు. పెద్దల సభలో అనేక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందని, మండలిలో మన వాణిని వినిపించి, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు ఎండగట్టాలన్నారు. కేంద్ర పెద్దలు సోము వీర్రాజు గళం విప్పుతారనే నమ్మకంతోనే ఆయనను ఎంపిక చేశారన్నారు. ఏపీలో బీజేపీకి మంచి రోజులు వచ్చాయని, ప్రభుత్వంలో జరిగే మంచి కార్యక్రమాలు ప్రజలకు వివరించడంతో పాటు కింద స్థాయిలో జరిగే లోపాలను ప్రభుత్వం దృష్టికి బీజేపీ తీసుకెళుతుందన్నారు. ప్రతి బూత్‌లో కూడా కమిటీలు వేసుకుని.. ఏపీలో అన్ని విధాలా పార్టీ బలంగా తయారవుతుందని ఎమ్మెల్యే పార్ధసారధి వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

మాజీ మంత్రి కాకాణి హైడ్రామా.. పోలీసులకు సవాళ్లు...

For More AP News and Telugu News

Updated Date - Apr 02 , 2025 | 03:19 PM