9 మంది ఎమ్మెల్సీలకు వీడ్కోలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:16 AM
తమ ఆరేళ్ల పదవీ కాలాన్ని శనివారంతో పూర్తి చేసుకోబోతున్న తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు శాసనమండలిలో గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు.

29వ తేదీతో ముగియనున్న ఆరేళ్ల పదవీకాలం
హైదరాబాద్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): తమ ఆరేళ్ల పదవీ కాలాన్ని శనివారంతో పూర్తి చేసుకోబోతున్న తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు శాసనమండలిలో గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన గురువారం వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పదవీ కాలం పూర్తి చేసుకోనున్న ఎమ్మెల్సీలను సత్కరించి, వారి సేవలను గుర్తు చేసుకున్నారు.
పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీలు
ఎంఎస్ ప్రభాకర్, మహామూద్ ఆలీ, టీ జీవన్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, అలుగుబెల్లి నర్సిరెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, కూర నరోత్తమ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మీర్జా రియాజుల్ హసన్ ఇఫేండి.