Share News

Union Budget 2024: బడ్జె‌ట్‌పై పెదవి విరిచిన నవీన్ పట్నాయక్

ABN , Publish Date - Jul 23 , 2024 | 08:34 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌‌పై బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువు తిరిన అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై ఆయన పెదవి విరిచారు.

Union Budget 2024: బడ్జె‌ట్‌పై పెదవి విరిచిన నవీన్ పట్నాయక్
Odisha BJD Chief Naveen Patnaik

భువనేశ్వర్, జులై 23: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌‌పై బీజేడీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ స్పందించారు. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వం కొలువు తిరిన అనంతరం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై ఆయన పెదవి విరిచారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. కానీ బడ్జెట్ వేళ ఆ అంశాన్ని కేంద్రం విస్మరించిందన్నారు. ఇది ఒక్కటే కాదు.. చాలా వాగ్దానాలు చేసిందని.. వాటినన్నింటిని పట్టించుకోలేదంటూ బీజేపీపై నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Union Budget 2024: బడ్జెట్‌పై రచ్చ.. సీఎం నితీష్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారుగా..!

Also Read:Budget 2024: బడ్జెట్‌పై స్పందించిన సీఎం చంద్రబాబు


ఇక ప్రత్యేక ప్యాకేజీ, కేటాయింపుల పేరుతో ఆంధ్రప్రదేశ్, బిహార్‌కు భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఒడిశాతోపాటు రాష్ట్ర ప్రజలను సైతం విస్మరించిందని ఈ బడ్జెట్‌ని చూస్తే అర్థమవుతుందన్నారు. అయితే ప్రతి ఏడాది రాష్ట్రంలో వరదలు, విప్తతులు సంభవిస్తాయని పేర్కొన్నారు. ఆ క్రమంలో తమకు విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కేంద్రాన్ని గతంలో చాలా సార్లు విజ్ఞప్తులు సైతం చేశామన్నారు.

Also Read: Delhi High Court: అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పోస్ట్‌లు.. కీలక ఆదేశాలు

Also Read: Union Budget 2024: బడ్జెట్‌పై స్పందించిన మంత్రి నారా లోకేశ్


విపత్తు నిర్వహణకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి... ఒడిశాను మాత్రం మోదీ ప్రభుత్వం పక్కన పెట్టేదన్నారు. ఇది ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. అలాగే బొ్గ్గుకు సంబంధించిన రాయల్టీ చెల్లింపుల్లో సైతం ఈ ఎన్డీయే సర్కార్ తీవ్ర అలక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Budget 2024: బిహార్‌కు ప్రత్యేక హోదా లేదు కానీ..

Also Read: Union Budget 2024: వీటి ధరలు తగ్గుతాయి.. వీటి ధరలు పెరుగుతాయి.


మరోవైపు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం.. రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో ఒడిశాకు చెందిన 9 మంది ఎంపీలు సభను వాకౌట్ చేశారు. ఇక ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీకాంత్ జేనా సైతం స్పందించారు. ఈ బడ్జెట్ ద్వారా ఒడిశాకు బీజేపీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బీజేపీ గెలిచింది. దాంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బాధ్యతలు చేపట్టారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 23 , 2024 | 08:34 PM