Home » New Delhi
స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే అర్థం.. ఎల్లప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులివ్వాలని కాదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు.
న్యాయ సంస్కరణలను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం... నేరం- శిక్ష విషయంలో హేతుబద్ధత లోపించిన తీర్పులను పునఃసమీక్షించాలని యోచిస్తోంది..
హింస, దాడులు వంటి చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కౌన్సిలర్ సేవలపై రణదీప్ జైశ్వాల్ మాట్లాడుతూ, ఎలాటి దాడులు, వేధింపులు, హింసకు భారత దౌత్యవేత్తలు లొంగరని చెప్పారు. కెనడాలో భారతీయులకు కాన్సులర్ సేవకు కొనసాగిస్తామని తెలిపారు.
భారత వాయుసేన, అమెరికాకు చెందిన రైడ్ షేరింగ్ యాప్ ‘ఉబెర్’ మధ్య ఇటీవల జరిగిన అవగాహన ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ (69) శుక్రవారం కన్నుమూశారు. మధుమేహం, హైపర్ టెన్షన్, గుండె సమస్యలతో గురువారం చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చేరారు.
ఇది హిందూ, ముస్లింలకు సంబంధించిన అంశంకాదని, పండుగ ప్రధాన స్ఫూర్తి దీపకాంతులను వెదజల్లడమే కానీ, పొగను వ్యాపింపజేయడం కాదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాలుష్యం విషయానికి వచ్చినప్పుడు సంప్రదాయం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.
వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశంలో వాదన ప్రారంభించిన వారిని మందలించకుండా తనను మందలించడంతో తనకు కోపం వచ్చిందని కల్యాణ్ బెనర్జీ చెప్పారు. ఆ కోపంలోనే బాటిల్‌ను పగులగొట్టానని, తన చేతి వేళ్లకు గాయలయ్యాయని చెప్పారు.
70 ఏళ్లు పైబడిన వారిందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని ధన్వంతరి జయంతి, తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా మంగళవారంనాడిక్కడ ప్రధాని ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రెయిడ్స్ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఢిల్లీకి చెంది ఒక వ్యాపారి తీహార్ జైల్ వార్డెన్‌తో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అనధికారికంగా గత కొన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టు గుర్తించారు.
వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) అధ్యక్షుడు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ ప్రకటించారు.