PM Modi: ప్రపంచ శక్తిగా భారత్ మారుతోంది: మోదీ
ABN , Publish Date - Mar 01 , 2025 | 03:55 PM
దేశ రాజధానిలో శనివారంనాడు నిర్వహించిన ఎన్‌ఎక్స్‌టీ కాంక్లేవ్ 2025లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత్ గురించి ప్రతిరోజూ సానుకూల సమాచారం వస్తుండటంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ, భారత్‌కు రావాలని తహతహలాడుతున్నాయని చెప్పారు.

న్యూఢిల్లీ: ఇన్నేళ్లు శ్రామిక శక్తిగా పేరుపొందిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచ శక్తిగా రూపొందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ఇటీవల పెద్దఎత్తున మహాకుంభమేళా నిర్వహించి నిర్వహణా నైపుణ్యాన్ని చాటుకుందని, రోజుకో రికార్డును భారతదేశం సృష్టిస్తోందని చెప్పారు. భారతదేశ నిర్వహణా నైపుణ్యం, ఆవిష్కరణల సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని అన్నారు. దేశ రాజధానిలో శనివారంనాడు నిర్వహించిన ఎన్‌ఎక్స్‌టీ కాంక్లేవ్ 2025 (NXT Conclave 2025)లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత్ గురించి ప్రతిరోజూ సానుకూల సమాచారం వస్తుండటంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ, భారత్‌కు రావాలని తహతహలాడుతున్నాయని చెప్పారు.
Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఫిబ్రవరి 26వ తేదీతో ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన మహాకుంభ్-2025 గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఒక టెంపరరీ సిటీలో నదీతీరాల వెంబడి కోట్లాది మంది ప్రజలు పవిత్రస్నానాలు చేయడంపై యావత్ ప్రపంచం ఆశ్చర్యంతో చూసిందని, మహాకుంభమేళా నిర్వహణ భారతదేశం పాటించే నిర్వహణా నైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు.
గ్లోబల్ లీడర్‌షిప్ దిశగా..
భారతదేశం గ్లోబల్ శక్తిగా ఎదుగుతున్న వైనాన్ని మోదీ వివరిస్తూ, ఏఐ సదస్సులో భారతదేశం కో-హోస్ట్‌గా వ్యవహరించిందని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత్ కీలక భూమిక పోషించనుందని చెప్పారు. తదుపరి ఏఐ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. ఏఐ, గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ల ద్వారా టెక్నాలజీ, ఇన్నొవేషన్, గ్లోబల్ డిప్లొమసీలో ఎదుగుతున్న శక్తిగా భారత్ కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు.
భారతదేశం సెమికండక్టర్లు, విమాన వాహక నౌకల తయారీ వంటి వాటితో వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆటోమొబైల్ ఉత్పత్తిదారుగా కూడా మరిందని వివరించారు. భారత దేశం పాటించే యోగా, ధ్యానం వంటివి విదేశీయులు ఆచరిస్తున్నారని, మన సూపర్‌ఫుడ్ మఖానా, మిల్లెట్, ఆయుష్ ఉత్పత్తులు విరివిగా వాడుతున్నారని మోదీ చెప్పారు.
ఇవి కూడా చదవండి
Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
Congress: కేరళ కాంగ్రెస్ నేతల భేటీకి థరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.