Home » Phone tapping
తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. కాళేశ్వరం మొదలుకొని ఫోన్ ట్యాపింగ్ వరకు అన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిజమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని బీజేపీ (BJP) రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ఆదివారం నాడు టేక్మాల్ మండలం పాల్వంచలో బీజేపీ జహీరాబాద్ పార్లమెంట్ బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సభకు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ఆలే భాస్కర్, బీబీ పాటిల్ తదితరులు హాజరయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రణీత్‌రావు ఎస్ఐబీలోని తన విభాగంలో ఉన్న....
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
Telangana: ‘‘నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గు చేటు’’ అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఓటమి తప్పదని గ్రహించి రెండు పార్టీలు చేతులు కలిపి తనను ఓడించాలని దుష్ట పన్నాగం పన్నుతున్నాయన్నారు.
Telangana: తెలంగాణలో ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా అదే విషయం వినిపిస్తోంది. ఈ కేసులో రోజు రోజుకు అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మొబైల్ ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోంది. ఐ-ఫోన్ సాంకేతిక వ్యవస్థ ఈ మేరకు ఆయనకు వర్తమానం పంపింది....
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ వస్తున్న వార్త రాష్ట్రంలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. లోకేష్ ఫోన్‌ను గుర్తు తెలియని సాఫ్ట్ వేర్లతో ఫోన్‌ను హ్యాకింగ్, ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందంటూ యువనేతకు ఆపిల్ సంస్థ ఈమెయిల్ పంపింది. ఈ వ్యవహారాన్ని టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంధ్ర కుమార్ లేఖ రాశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సంస్థే నారా లోకేష్‌కి తెలిపింది. ఈ మేరకు సెక్యూరిటీ అలెర్ట్‌ను ఆపిల్ సంస్థ ఆయన ఫోన్‌కి పంపించింది.
Telangana: తెలంగాణ వ్యాప్తంగా పెను దుమారాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో స్పెషల్ పీపీని నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గత నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసును పోలీసులు విచారిస్తున్నారు.