Home » Rajasthan
తన భార్యను ప్రాణం పోయే వరకు విడువనని ప్రమాణం చేశాడు. అంగరంగ వైభవంగా పెళ్ళిచేసుకుని తన భార్యను అత్తింటికి కూడా తీసుకొచ్చాడు. కానీ..
అక్రమంగా అరెస్టు చేసిన ఓ వ్యక్తిని జైల్లో పాము కాటేయడంతో ముగ్గురు పోలీసులపై స్పెన్షన్ వేటు పడింది. బాధితుడిని వారు అక్రమంగా అరెస్ట్ చేశారన్న విషయం పాము కాటుతో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతకొంత కాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్మ ధ్య దోస్తీ కుదర్చడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలే ఈ పరిణామానికి బలం చేకూర్చుతున్నాయి.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టి నాయకత్వంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారని, ఆయన సూచన మేరకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో తలెత్తిన విభేదాలను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నానని ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ ) శనివారంనాడు పీటీఐకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య మీద కోపంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేశాడు. దీంతో 5 ఏళ్ల బాలుడు చనిపోగా.. 9 ఏళ్ల బాలికను గ్రామస్థులు రక్షించారు. దీంతో తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
ఎదురింట్లో ఉంటాడు, తనతో పాటు చదువుకుంటున్నాడనే కారణంతో ఆ యువకుడితో ఆమె చనువుగా ఉండేది.. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. కలిసి తిరగడం ప్రారంభించారు.. ఆమె అతడిని పూర్తిగా నమ్మింది.. అలా నమ్మడమే ఆమె కొంప ముంచింది..
కష్టపడి పనిచేస్తున్న భర్తకు సర్ఫైజ్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ప్లాన్ చేసింది. ఇద్దరు పిల్లలను తీసుకుని భర్త గదికి వెళ్ళింది కానీ..
బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొందరు తెగ హడావుడి పడుతుంటారు. ఎలాగైనా తాము అనుకున్న సమయానికి గమ్యస్థానం చేరాలనే తొందరలో సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి. రన్నింగ్ బస్సులు, రైళ్లు ఎక్కే సమయంలో...
నిధులు, వాటికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇవన్నీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఓ గ్రామానికి చెందిన చెరువులో భోషాణం బయటపడటంతో..
రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో అత్యంత విషాదకర సంఘటన జరిగింది. జూన్ 20న జసబ్ ఖాన్ (44)ను ఓ పాము కాటు వేసింది. ఆయన పోఖ్రాన్‌లోని ఓ ఆసుపత్రిలో నాలుగు రోజులపాటు చికిత్స పొంది, తిరిగి ఇంటికి చేరుకున్నారు. కానీ జూన్ 26న ఆయన మరోసారి పాము కాటుకు గురయ్యారు. ఈసారి కూడా ఆయన చికిత్స పొందినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. జోధ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.