Home » RBI
అంతుబట్టని రీతిలో రూ.88,032.50 కోట్ల విలువైన రూ.500 నోట్లు అదృశ్యమైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) కొట్టిపారేసింది. నాసిక్ కరెన్సీ నోట్ ముద్రణాలయంలో ముద్రితమైన ఈ నోట్లు ఆర్బీఐకి చేరలేదని సమాచార హక్కు చట్టం (RTI) ప్రకారం చేసిన దరఖాస్తుకు సమాధానం వచ్చిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
పెద్ద రూ.2000 నోట్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో రూ.500 నోట్లపై వెలుడుతున్న ఊహాగానాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రూ.500 నోట్లను సర్క్యూలేషన్ నుంచి ఉపసంహరించుకునే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
ఈ ఏడాది మే 19న ఆర్బీఐ 2వేల నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ 2వేల నోట్ల డిపాజిట్లపై కీలక ప్రకటన చేశారు. గడిచిన 20 రోజుల్లో 2వేల నోట్ల డిపాజిట్ గణనీయంగా పెరిగిందని వెల్లడించింది.
భారతీయ రిజర్వు బ్యాంక్ గురువారం అందరూ ఊహించినట్లుగానే రెపో రేటును యథాతథంగా కొనసాగించింది.
భారతీయ రిజర్వు బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ రూ.2,000 నోట్ల మార్పిడికి అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో అపీలు దాఖలు చేసే
2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు(Frauds) పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికలో పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది
2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎక్కువగా చలామణీ అయిన నోట్ల జాబితాలో 500 రూపాయల నోట్లు ముందు వరుసలో నిలిచాయి. దేశంలో చలామణీ అవుతున్న కరెన్సీ నోట్ల సంఖ్య 13,621 కోట్లు కాగా.. అందులో 5,163 కోట్ల నోట్లు 500 రూపాయల నోట్లే కావడం విశేషం.
రూ.2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డుల అవసరం లేకుండా రూ.2వేల నోట్లను మార్చుకోవడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. గుర్తింపుకార్డు, అప్లికేషన్లు లేకుండా ఒకేరోజు రూ.20 వేలు మార్చుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. గుర్తింపు కార్డు లేకపోతే నల్లధనం.. తెల్లధనం అవుతుందంటూ పిల్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ పిల్‌ను కొట్టివేసింది.
రూ.2000 నోట్ల మార్పిడి ప్రక్రియ నిరంతరాయంగా పూర్తవుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం చెప్పారు.