Home » Samajwadi Party
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ (Mukthar Ansari) సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అప్జల్ అన్సారీ ఆయన అన్న మృతిపై సంచలన ప్రకటన చేశారు. ముఖ్తార్ అన్సారీ కథ సుఖాంతమైందని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఆలోచిస్తోందని అఫ్జల్ పేర్కొన్నారు.
2024 లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలిదశలో 102 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీయే(NDA), ఇండియా కూటమి పార్టీలు తమ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
ఒకప్పుడు ఉత్తర్ప్రదేశ్ను శాసించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఢిల్లీలో అధికారానికి దగ్గరవ్వచ్చు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ (BJP) యూపీలో అధిక సీట్లు గెల్చుకోవడంతో ఆ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల పరిధిలో 102 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈశాన్య భారతంలోని ఆరు రాష్ట్రాల్లో 9 లోక్సభ స్థానాలతో పాటు.. తమిళనాడులోని 39 స్థానాలు, లక్షద్వీప్లోని ఒక లోక్సభ స్థానంలో మొదటి దశలో పోలింగ్ జరగనుంది.
హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎస్పీ మాజీ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh ) లోని లక్నోలోని కోర్టు సూచనల మేరకు పోలీసులు కేసు నమోదు
ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 సీట్లు ఉండగా అందులో 78 స్థానాలను బీజేపీ గెలుచుకోనుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్, సమాజ్వాదీ ప్రధాన పార్టీలుగా ఉన్న ఇండియా కూటమికి కేవలం 2 సీట్లకే పరిమితం కానుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చూస్తే పూర్వాంచల్లో 29 సీట్లు ఉండగా బీజేపీ 28, ఎస్పీ-1 సీటు గెలుస్తుందని పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లో అధికార భారతీయ జనతా పార్టీ తీరుపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేయించడాన్ని తప్పుపట్టారు.
రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సమాజ్వాదీ పార్టీకి జనసత్తా దళ్ (లోక్ తాంత్రిక్) పార్టీ షాక్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తానని ప్రకటించింది.