Home » Telugu states
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూన్ 1న టోల్ రేట్ల(toll rates) పెంపుదల ఉండగా, ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.
ఈ నెల 18 వ తేదీన తెలంగాణ కేబినేట్ భేటీ కానున్నది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలు, ఉమ్మడి ఏపీతో పీట ముడిగా ఉన్న సమస్యలపై పరిష్కారం దిశగా ఈ భేటీలో చర్చించనున్నారు.వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల కొనుగోళ్లపై మంత్రి వర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పలు సమస్యలపై బుధవారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు : భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది...
‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Temperatures) మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 - 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం నాడు విడుదల చేసింది. ఫలితాలను కమిషన్ వెబ్ సైట్లో చూడొచ్చు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 28వ తేదీన జరిగింది. అందులో మెయిన్స్కు క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారు.
Magha Masam : ‘శ్రీరస్తూ.. శుభమస్తూ.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’. ప్రతీ ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఘట్టం పెళ్లి.. అటువంటి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే.. ఎవరైనా వెంటనే చెప్పే మాసం.. మాఘమాసం.. ఎందుకంటే పెళ్లిళ్లకు పెట్టింది పేరు మాఘ మాసం ఈ మాసంలో ఉన్నంత బలమైన ముహూర్తాలు మరే మాసంలోను ఉండవని పండితులు, పురోహితులు చెబుతున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న అరాచక, అవినీతి, నిర్బంధ పాలన నా జీవితంలో చూడలేదు. ప్రతీకార రాజకీయం నా నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ పాల్పడలేదు.