Home » TG News
తెలంగాణ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ పీజీ 2024-25 మెరిట్ లిస్టు(NEET PG 2024-25 Merit List)ను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు వైద్య విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.
ఆరు నెలల చిన్నారిని తల్లినుంచి వేరుచేసి ఇంటినుంచి వెళ్లగొట్టారు.. మానసికంగా వేధించడంతో ఆమె, ఆమె తండ్రి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో మంగళవారం ఆమె తండ్రి చనిపోయాడు.
ఓ యువకుడిని హత్య చేసి గోనె సంచిలో మూటకట్టి రోడ్డు పక్కన పడేశారు. గోనె సంచి నుంచి దుర్వాసన రావడం గమనించిన పారిశుధ్య కార్మికులు శానిటరీ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్నేహితుడి పుట్టినరోజని కేక్ కొని తెచ్చారు. రోడ్డుపై కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. ఆ సంతోషాలను నెమరు వేసుకుంటూ మాట్లాడుతుండగా అతివేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్నేహితుల్లో ఒకరు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డాడు.
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కుట్రలను సమర్థంగా ఎదుర్కొందామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) అన్నారు. వర్గీకరణ అమలు కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్-ముజాఫర్పూర్(Secunderabad-Muzaffarpur) మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు(కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
బ్రేక్‌ఫాస్ట్‌గా నగరవాసులు ఉల్లిదోసెనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. దేశంలో ఉదయం పూట అత్యధికంగా దోసెను ఆర్డర్ చేసేది హైదరాబాదీలేనని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ పేర్కొంది. ‘
CM Revanth Reddy: భారత బలగాలు మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలేవా అని కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. మన దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడుతే అధునాతన ఆయుధాలతో ఊచకోత కోసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Sandhya Theatre Stampede: హైదరాబాద్‌లోని సంధ్యాథియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను(Allu Arjun) చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు. అయితే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.
Minister Ponguleti: ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పారదర్శకంగా ఉండేందుకు విజిలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏమైనా అనుమానాలు ఉంటే వెబ్ సైట్లో నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్, ఇసుకపై కేబినెట్లో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.