Home » TS Assembly Elections
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు (CM KCR) అసెంబ్లీ ఎన్నికలు-2023లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. భార్య శోభతో కలిసి వచ్చి ఓటు వేశారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలోని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు( CM KCR ) సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును గురువారం నాడు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దంపతులు హెలికాప్టర్‌లో రేపు చింతమడకకు రానున్నారు.
మీకు ఇంకా ఓటర్ స్లిప్ అందలేదా? మీరు ఓటు ఎక్కడ వేయాలో తెలియడం లేదా?, మీ చేతిలో ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నా.. ఏం చేయాలో అర్థం కావడంలేదా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. బుధవారం నాడు సీఈఓ కార్యాలయంలో ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలల్లో నాలుగు వేలకు పైగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ అదనపు బలగాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు .
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్దం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో రాష్ట్ర పోలీసులు లక్షమంది సిబ్బందితోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించారు. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు.
న్నికల ముందు సుప్రీంకోర్టు ( Supreme Court ) లో మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) కి ఊరట లభించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా మంత్రి మల్లారెడ్డిని నిలువరించాలని దాఖలైన పిటీషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
బీఆర్ఎస్ ( BRS )నేతలు బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు రావని హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం చూపు కరీంనగర్ వైపు చూస్తోంది. కరీంనగర్ నుంచి బరిలో ఈ సారి ఎమ్మెల్యే బరిలో బండి సంజయ్ నిలవనున్నారు. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కోరుట్లలో బీజేపీ ఫైర్ బ్రాండ్ అరవింద్ పోటీ చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో కార్యాలయంలోకి కాంగ్రెస్ ( Congress ) నాయకులు వచ్చారు.
అంబర్‌పేట ప్రజలు తమ రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా అంబర్‌పేటకు త్వరలో మెట్రో రైలు తీసుకు వస్తామని రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) హామీ ఇచ్చారు.