Home » Vinesh Phogat
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) ఈరోజు భారతదేశానికి తిరిగి వచ్చారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమె ఢిల్లీ(delhi) విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆమె చాలా ఏడ్చింది. ఈ క్రమంలో వినేష్‌కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు.
పారిస్ ఒలింపిక్స్ 2024(Olympics 2024)లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్‌కు వెళ్లకముందే అనర్హత వేటుకి గురైన వినేశ్ ఫొగట్‌కి మరో షాక్ తగిలింది. రజత పతకం ఇవ్వాలని ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) తోసిపుచ్చింది.
భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) వాయిదా వేసింది. ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన ఫోగట్.. 100 గ్రాములు ఎక్కువ బరువు పెరిగారని ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో ఫోగట్ రజత పతకం ఇవ్వాలని కాస్‌లో అప్పీల్ చేశారు. ఆమె తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా గట్టిగా వాదనలు వినిపించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఎదురైన పరిస్థితి చాలా మందికి మేలుకొలుపుగా మారింది. కేవలం 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేశ్ పతకం సాధించే అవకాశం కోల్పోవడం చాలా మందికి షాక్ కలిగించింది. ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులకు ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసిన విషయం విదితమే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) ఇవాళ తీర్పు వెలువరించనుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య రీతిలో పతకం కోల్పోయినప్పటికీ వినేష్ ఫొగట్ తమ అందరికీ చాంపియనే అని ఆమె సొంత రాష్ట్రం హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీ పేర్కొన్నారు.
రెజ్లింగ్‌లో భారత్ పతకం ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్న సమయంలో మరో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ పతకం ఆశలు సజీవంగా ఉంచాడు. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లో ఆల్బానియా క్రీడాకారుడు జెలిమ్ఖాన్ అబాకరోవ్‌పై 12-0తో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు ప్రవేశించాడు.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరి చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్‌పై.. తుదిపోరుకు కొద్ది గంటల ముందు అనర్హత వేటు పడటంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) పై వేటు వెనుక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ..