కి‘లేడీ’.. 8 మందితో పెళ్లి!

ABN , First Publish Date - 2021-09-03T07:37:53+05:30 IST

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 8మందిని పెళ్లి చేసుకుందా మహిళ. పెళ్లి చేసుకుని వారం రోజుల పాటు కాపురం చేయడం.. తర్వాత గొడవ పెట్టుకుని భరణం వసూలు చేసి విడిపోవడం..

కి‘లేడీ’.. 8 మందితో పెళ్లి!

  • వైద్యపరీక్షల్లో ఎయిడ్స్‌ ఉన్నట్లు వెల్లడి

పటియాల, సెప్టెంబరు 2: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 8మందిని పెళ్లి చేసుకుందా మహిళ. పెళ్లి చేసుకుని వారం రోజుల పాటు కాపురం చేయడం.. తర్వాత గొడవ పెట్టుకుని భరణం వసూలు చేసి విడిపోవడం.. అదే ఆమె వ్యాపారం. తాజాగా పంజాబ్‌లోని పటియాలలో 9వ పెళ్లికీ సిద్ధమవుతుండగా ఆమె బండారం బట్టబయలైంది. విచారణలో తన మోసాలను నిందితురాలు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. హరియాణలోని కైతల్‌ జిల్లాకు చెందిన ఆ నిందితురాలికి 2010లో పెళ్లైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో సంపాదన కోసం మోసాలకు తెర తీసిందని పోలీసులు తెలిపారు. ఆమెకు కన్నతల్లి, కొంతమంది సంబంధీకులు అండగా ఉన్నారన్నారు. పంజాబ్‌, హరియాణ రాష్ట్రాల్లో ఈ కిలేడీ చేతిలో చాలామంది మోసపోయారు. వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా రావడం గమనార్హం. ఆమె పాత భర్తలందరికీ కూడా త్వరలో హెచ్‌ఐవీ పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-09-03T07:37:53+05:30 IST