Bihar Assembly Polls 2025: నిన్న, నేడు, రేపు కూడా ఆయనే సీఎం
ABN , Publish Date - Mar 07 , 2025 | 02:55 PM
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సపోర్ట్‌తో ముఖ్యమంత్రి స్థాయికి నితీష్ కుమార్ ఎదిగారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా కేంద్రంలో నితీష్ పొత్తు సాగిస్తున్నారని సమ్రాట్ చౌదరి చెప్పారు.

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) తర్వాత ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందన్న ఊహాగానాలను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి తోసిపుచ్చారు. మరో విడత సీఎంగా నితీష్ కుమార్‌కు బీజేపీ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా నితీష్ స్థానే కొత్త లీడర్‌ను ఎంచుకునే అవకాశం ఉందని కొద్దికాలంగా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.
Deputy CM: ఉదయనిధికి వ్యతిరేకంగా కొత్త కేసుల నమోదుపై స్టే
బీహార్‌లో ఎన్డీయేకు 1996 నుంచి నాయకత్వం వహిస్తు్న్న నితీష్‌కు బాసటగా బీజీపీ నిలుస్తుందని సమ్రాట్ చౌదరి శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ''నిన్న ఆయనే నాయకుడు, నేడు కూడా ఆయనే నాయకుడు. రేపటి నాయకుడు కూడా ఆయనే'' అని చౌదరి తెలిపారు.
నిశాంత్ కుమార్ ఎంట్రీపై..
ఇంతవరకూ రాజకీయ జీవితానికి దూరంగా ఉంటున్న నితీష్ కుమారుడు నిశాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలపై చౌదరి మాట్లాడుతూ, అది పూర్తిగా జేడీయూకు, నితీష్‌కు చెందిన అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భాగస్వామ్య పార్టీగా వారికి తమ మద్దతు ఉంటుందన్నారు.
200 సీట్లు పైమాటే..
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సపోర్ట్‌తో ముఖ్యమంత్రి స్థాయికి నితీష్ కుమార్ ఎదిగారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా కేంద్రంలో నితీష్ పొత్తు సాగిస్తున్నారని చౌదరి చెప్పారు. జాతీయ స్థాయిలో మోదీజీ నాయకత్వంలో నితీష్ పనిచేస్తుండగా, బీహార్‌లో నితీష్ తమ నాయకుడిగా ఉన్నారని వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను 200కు పైగా సీట్లు ఎన్డీయే గెలుచుందని, బీహార్‌లో డబుల్ గవర్నర్‌మెంట్ మోడల్ సాధించిన విజయాలు తమకు ఘనవిజయాన్ని అందిస్తాయని జోస్యం చెప్పారు.
తేజస్వి యాదవ్ కేవలం ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నామినీ మాత్రమేమని, ఆయన నుంచి ఎన్డీయేకు వచ్చే సవాలు ఏదీ ఉండదని మరో ప్రశ్నకు సమాధానంగా చౌదరి చెప్పారు. ''తేజస్వి చిన్నపిల్లోడని నేను ఎప్పుడూ చెబుతుంటాను. పార్టీకి నియామకం జరపాలని లాలూ అనుకున్నప్పుడు తేజస్వి గురించి ఎవరూ మాట్లాడుకున్న వారే లేరు'' అని అన్నారు. ఆర్జేడీ 15 ఏళ్ల పాలనలో చీకటిరోజులు, హింస గురించి అందరికీ తెలిసిందేనని, చివరకు లాలూ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకలోనూ దొంగతనం జరగడం అందరికీ గుర్తుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Ranya Rao questioned by Police: నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసు.. విచారణలో బయటపడ్డ కీలక విషయాలు
భారత్‌కు అప్పగించొద్దు.. చిత్రవధ చేస్తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.