మూడు కొత్త ప్లాన్లను ప్రకటించిన Disney+ Hotstar
ABN , First Publish Date - 2021-07-28T00:40:58+05:30 IST
మూడు కొత్త ప్లాన్లను ప్రకటించిన Disney+ Hotstar

న్యూఢిల్లీ: ప్రముఖ నెట్వర్క్ సంస్థ డిస్నీ + హాట్స్టార్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. మూడు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిస్నీ + హాట్స్టార్ పేర్కొంది. డిస్నీ + హాట్స్టార్ మొబైల్ హెచ్డీ నాణ్యత గల ప్లాన్ సంవత్సరం వరకు రూ. 499, డిస్నీ + హాట్స్టార్ సూపర్ హెచ్డీ నాణ్యత గల ప్లాన్ సంవత్సరం వరకు రూ. 899, డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం హెచ్డీ నాణ్యత గల 4కే ప్లాన్ సంవత్సరం వరకు రూ. 1,499కే లభించనుందని కంపెనీ పేర్కొంది. డిస్నీ + హాట్స్టార్ మొబైల్ హెచ్డీలో ఒక మొబైల్ పరికరానికి సపోర్టు ఇస్తోంది. డిస్నీ + హాట్స్టార్ సూపర్ హెచ్డీలోని ఏదైనా రెండు పరికరాలకు సపోర్టు ఇస్తోంది. డిస్నీ + హాట్స్టార్ ప్రీమియం 4కె వరకు నాలుగు పరికరాలకు సపోర్టు ఇస్తోందని కంపెనీ తెలిపింది.