పీఎస్‌ఎల్వీ-సీ50కి గ్రీన్‌సిగ్నల్!
ABN , First Publish Date - 2020-12-16T07:25:20+05:30 IST
పీఎస్ఎల్వీ-సీ50 రాకెట్ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం ఉదయం వర్చువల్ విధానంలో

వర్చువల్ విధానంలో ఎంఆర్‌ఆర్ ల్యాబ్ సమావేశం
నేటి మధ్యాహ్నం నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం
ఎల్లుండి మధ్యాహ్నం 3.41కు నింగిలోకి రాకెట్
42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-01తో రోదసిలోకి
శ్రీహరికోట(సూళ్లూరుపేట) డిసెంబరు 15: పీఎస్ఎల్వీ-సీ50 రాకెట్ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం ఉదయం వర్చువల్ విధానంలో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్‌ఆర్) సమావేశం నిర్వహించి ప్రయోగానికి రాకెట్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు కూడా సంసిద్ధత వ్యక్తం చేయడంతో బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు షార్ శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 3.41 గంటలకు కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ50 రాకెట్ దేశ 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎ్‌స-01తో రోదసిలోకి దూసుకుపోనుంది. ఈ ప్రయోగ పర్యవేక్షణ కోసం ఇస్రో చైర్మన్ కె.శివన్ బుధవారం షార్‌కు చేరుకోనున్నారు.
ఈ ప్రయోగ మైలురాళ్లు...
ఇస్రో ఈ ఏడాది నిర్వహిస్తున్న రెండో ప్రయోగం కాగా షార్ నుంచి జరగనున్న 77వ ప్రయోగం.
ఇందుకోసం 52వ పీఎ్‌సఎల్వీ రాకెట్‌ను వినియోగిస్తున్నారు. ఆరు బూస్టర్లతో పనిచేసే ఎక్స్‌సెల్ తరహా రాకెట్‌ను రెండోసారి వినియోగిస్తున్నారు.