ఏపీలో మద్యపాన నిషేధం కాదు.. మద్యపాన నిషా..: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-05-24T00:21:22+05:30 IST
మద్యం విషయంలో ఏపీ సీఎం జగన్ మాట తప్పారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు.

విజయవాడ: మద్యం విషయంలో ఏపీ సీఎం జగన్ మాట తప్పారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో మద్యపాన నిషేధం కాదు.. మద్యపాన నిషా అమలవుతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో చెప్పింది దశలవారీ మద్య నిషేధం.. ప్రస్తుతం అమలవుతున్నది దశలవారీ మద్య నిషేధమని దెప్పిపొడిశారు. నవరత్నాలలో ఒకటి మద్యపాన నిషేధరత్నం గులకరాయిగా మారిందని సెటైర్లు వేశారు. అమ్మఒడి నాన్నబుడ్డికి చాలడంలేదని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.