రాజధానిని మార్చడం.. హామీ ఉల్లంఘనే!

ABN , First Publish Date - 2020-11-03T09:20:25+05:30 IST

రాజధాని కోసం బంగారం పండే భూములను త్యాగం చేసిన రైతులకు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడం ఏమాత్రం సరి కాదని

రాజధానిని మార్చడం.. హామీ ఉల్లంఘనే!

హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు

బంగారం పండే భూముల్ని రైతులు త్యాగం చేశారు

33,771 ఎకరాలిచ్చారు

7 నెలల్లోనే వెలగపూడిలో భవనం

2016 నుంచే కార్యకలాపాలు

పూర్తయితే ఇద్దరూ విజేతలే!

రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాని నుంచి తొలగడానికి లేదు

రాజధాని పిటిషన్లపై విచారణ ప్రారంభం


అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రాజధాని కోసం బంగారం పండే భూములను త్యాగం చేసిన రైతులకు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించడం ఏమాత్రం సరి కాదని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాందివాన్‌ స్పష్టం చేశారు. మూడు రాజధానుల అం శం తీసుకురావడమంటే ఆ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించినట్లేనని హైకోర్టుకు నివేదించారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ర ద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ పలువురు దాఖ లు చేసిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తు లు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాస నం ముందు సోమవారం తుది విచారణ ప్రా రంభమైంది. ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ తరఫున శ్యాందివాన్‌ వాదనలు వినిపించారు. ప్రపంచస్థాయి రాజధాని వస్తుందన్న నమ్మకం తో 22 గ్రామాలకు చెందిన 29,754 మంది రై తులు 33,771 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా అప్పగించారని గుర్తుచేశారు. ‘ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా భూసమీకరణ కింద ఇంత  భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. భూసమీకరణ చట్టబద్ధమైనది. దీనిని ప్రభుత్వాలు విస్మరించజాలవు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలన్నీ ఒకేచోట ఉండాల్సి ఉంది. శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సాయం అందించాల్సి ఉంది.


విభజన చట్టంలో ఏక రాజధాని ఉంది తప్ప.. 3 రాజధానుల ప్రస్తావన లేదు. ఆ చట్టంలో రాజధాని ఏర్పాటు విష యం ఉంది. ఆ కారణంగానే నాటి ప్రభుత్వం అమరావతిని ప్రజారాజధానిగా నిర్ణయించింది. దాని నిర్మాణంలో ప్రజలను, రైతులను భాగస్వాములను చేయడంతో పాటు భూసమీకరణ చేపట్టింది. అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని  వారికి స్పష్టమైన హామీ ఇచ్చింది. దీన్ని విశ్వసించే రైతులు భూములను అప్పగించారు. భూములు స్వీకరించేటప్పుడు నిర్దిష్ట సమయంలోగా రాజధానిని పూర్తి చేస్తామని చెప్పిన ప్ర భుత్వం.. దానికే కట్టుబడి ఉండాలి. ప్రజాప్రయోజనాల కోసం రాష్ట్రప్రభుత్వం రాజధానిని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించిం ది. అంతేగాక కేవలం 7 నెలల్లోనే వెలగపూడిలోని 27 ఎకరాల్లో తాత్కాలిక భవనాన్ని నిర్మించింది. 6 బ్లాకులతో నిర్మితమైన ఈ భవనంలో 2016 నుంచే మంత్రులు, అధికారులు తదితర 6 వేల మంది కార్యకలాపాలు ప్రారంభించారు. రూ.2,209 కోట్ల వ్యయంతో 3,840 గృహాల నిర్మాణం చేపట్టారు. రూ.కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. అవి పూర్తయితే రైతులతో పాటు ప్రభుత్వమూ ఆ ఫలితాలను పొందుతుంది. అంతిమంగా ఇద్దరూ విజేతలు గా నిలబడతారు. విభజన చట్టం మేరకే అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, దాని నుంచి పక్కకు తొలగడానికి లేదు. రాజధాని అంటే భవనాలే  కాదు. వ్యూహాత్మక అభివృద్ధి జరగాల్సి ఉంది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు తదితరాలన్నీ ఉండాలి. ప్రభు త్వం మారినప్పుడల్లా రాజధానులు మార్చడం ఏమాత్రం సరికాదు.


మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంది’ అని వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కేంద్ర నిధులను వద్దనుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవచ్చా అని ప్రశ్నించింది. ఇందుకు సీనియర్‌ న్యాయవాది బదులిస్తూ.. కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయాన్ని రాష్ట్రం తిరస్కరించవచ్చని, కానీ రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్నా క, దానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని పేర్కొన్నారు. ఆయన వాదనల కొనసాగింపునకు విచారణ మంగళవారానికి వాయి దా పడింది. 

Updated Date - 2020-11-03T09:20:25+05:30 IST