పెద్దింటి అమ్మవారిని దర్శించిన గెటప్ శ్రీను
ABN , First Publish Date - 2021-02-25T05:04:18+05:30 IST
కొల్లేటి కోట పెద్దింటి అమ్మవారిని టీవీ కళాకారుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ (గెటప్ శ్రీను), సుజాత దంపతులు బుధవారం దర్శించుకున్నారు.
ఆకివీడు రూరల్ ఫిబ్రవరి 24: కొల్లేటి కోట పెద్దింటి అమ్మవారిని టీవీ కళాకారుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ (గెటప్ శ్రీను), సుజాత దంపతులు బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయసిబ్బంది వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. చిన్న ప్పటి నుంచి అమ్మవారి ఆలయానికి రావడం ఆయన గుర్తు చేసుకున్నారు.