ఇండియన్ కోస్ట్ గార్డ్ చీఫ్‌గా పఠానియా
ABN , First Publish Date - 2022-01-01T01:41:10+05:30 IST
ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా ఏస్ చాపర్ పైలట్ వీరెందర్ సింగ్ పఠానియా నియామకం అయ్యారు. 7,000 కిలోమీటర్ల సుదీర్ఘ తీరం ఉన్న కోస్ట్ గార్డ్‌కి ఇక నుంచి ఈయనే అధినేతగా వ్యవహరించనున్నారు..

న్యూఢిల్లీ: ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా ఏస్ చాపర్ పైలట్ వీరెందర్ సింగ్ పఠానియా నియామకం అయ్యారు. 7,000 కిలోమీటర్ల సుదీర్ఘ తీరం ఉన్న కోస్ట్ గార్డ్‌కి ఇక నుంచి ఈయనే అధినేతగా వ్యవహరించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చాపర్ పైలట్‌గా కెరీర్‌ని ప్రారంభించిన పఠానియా.. ఒక్కో మెట్టు ఎక్కుతూ కోస్ట్ గార్డ్ డీజీ వరకు ఎదిగారు. 35 సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో వివిధ పదవుల్లో ఆయన సేవలు అందించారు. గతంలో ఈయన న్యూఢిల్లీలోని ఉసీజీ కేంద్ర కార్యాలయంలో జనరల్ పాలిసీ అండ్ ప్లాన్స్‌కి డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీతో పాటు న్యూఢిల్లీలోని డిఫెన్స్ కాలేజీలో పఠానియా చదువుకున్నారు. అనంతరం హెలికాప్టర్ పైలట్‌గా అర్హత సాధించారు. ఇక నార్త్ వెస్ట్ కోస్ట్ గార్డ్ రీజియన్‌తో పాటు వెస్ట్ కోస్ట్ గార్డ్ రీజియన్‌లో అనేక విభాగాల్లో పని చేశారు.