షర్మిలలో వైఎస్ నాయకత్వ లక్షణాలు: బ్రదర్ షఫీ
ABN , First Publish Date - 2021-02-17T21:02:05+05:30 IST
షర్మిల పార్టీలో చేరికపై బ్రదర్ షఫీ స్పందించారు.

హైదరాబాద్: షర్మిల పార్టీలో చేరికపై బ్రదర్ షఫీ స్పందించారు. మీడియాతో బుధవారం మాట్లాడిన ఆయన.. షర్మిలలో వైఎస్ నాయకత్వ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. షర్మిల పెట్టబోయే పార్టీలో పని చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాజకీయాల్లో మార్పు కోసం ప్రజలను మోటివేషన్ చేస్తానని అన్నారు. ఇదిలా ఉంటే, షర్మిలతో కలిసి పని చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారన్న వార్తలు ఉదయం నుంచి ప్రచారంలో ఉన్నాయి. పార్టీలో కార్యకర్తలను, నేతలను తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో మోటివేట్ చేయనున్నట్టు చెబుతున్నారు.