అత్తాపూర్-రాజేంద్రనగర్ ర్యాంపు పనుల్లో జాప్యం
ABN , First Publish Date - 2021-03-01T13:49:45+05:30 IST
పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వేలో రాజేంద్రనగర్ నుంచి అత్తాపూర్ మార్గంలో

హైదరాబాద్/రాజేంద్రనగర్ : పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వేలో రాజేంద్రనగర్ నుంచి అత్తాపూర్ మార్గంలో పిల్లర్ నెంబర్ 164 వద్ద నూతనంగా నిర్మించిన ర్యాంపు పనులు పూర్తయ్యాయి. అవతలి వైపు అత్తాపూర్ నుంచి రాజేంద్రనగర్ మార్గంలో నిర్మించాల్సిన ర్యాంపు పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఒకే సమయంలో రెండు పక్కల ప్రారంభించిన ర్యాంపు పనులు ఒక వైపు త్వరగా నిర్మించి ఇంకోవైపు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్, బుద్వేల్, ఉప్పర్పల్లి, హైదర్గూడ, అత్తాపూర్ ప్రజలకు పీవీ నర్సింహరావు ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణం చేయడం సులభం అవుతుంది. నగరం వైపు వెళ్లాలన్నా, ఆరాంఘర్ వైపు వెళ్లాలన్నా ఈ ర్యాంపుల నుంచి వెళ్లడానికి వీలు కలుగుతుంది. అయితే అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న ర్యాంపు పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.