స్వామినారాయణ్ గురుకుల్ ఏర్పాటు అభినందనీయం
ABN , First Publish Date - 2021-08-28T05:32:07+05:30 IST
అంతర్జాతీయ స్థాయిలో గుర్తిం పు ఉన్న స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాల సూర్యాపేట ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.
మంత్రి జగదీ్‌షరెడ్డి
ఘనంగా అంతర్జాతీయ పాఠశాలకు భూమి పూజ
అపూర్వ ఇన్‌ఫ్రా స్వామినారాయణ్ ఏకో టౌన్‌షి్‌ప బ్రోచర్ ఆవిష్కరణ
చివ్వెంల, ఆగస్టు 27: అంతర్జాతీయ స్థాయిలో గుర్తిం పు ఉన్న స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాల సూర్యాపేట ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఉండ్రుగొండ సమీపంలో జాతీయ రహదారి-65 పక్కన నూ తనంగా ఏర్పాటు చేస్తున్న స్వామినారాయణ్ గురుకుల్ అం తర్జాతీయ పాఠశాలకు శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి భూ మి పూజలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం అపూర్వ ఇన్‌ఫ్రాకు చెందిన స్వామినారాయణ్ ఏకో టౌన్‌షి్‌ప 120 ఎకరా ల వెంచర్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడు తూ, జిల్లా కేంద్రానికి సమీపంలో కాకతీయులు, రుద్రమదేవి పాలించిన అహ్లాదకర ఉండ్రుగొండ గుట్టల ప్రాంతంలో అం తర్జాతీయస్థాయి పాఠశాల ఏర్పాటు అభినందనీయమన్నారు. స్వామినారాయణ్ గురుకుల్ విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందిస్తూ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఉండ్రుగొండ ప్రాంతానికి ఘన చరిత్ర ఉందని అలాంటి ప్రాంతంలో పేరుగాంచిన గురుకుల్ ఏర్పాటుతో ఆ ఖ్యాతి మరింత రెట్టింపు కానుందన్నారు. గురుకుల్‌కు ఏకో టౌన్‌షి్‌ప సహకరించడం గర్వించదగ్గ విషయమన్నారు. అన్ని రకాల సదుపాయాలు, హంగులతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంచర్‌ను ఏర్పాటు చేయడం విశేషమన్నారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాద వ్ మాట్లాడుతూ, స్వామినారాయణ్ గురుకుల్‌తో సూర్యాపేటకు అంతర్జాతీయ ఖ్యాతి రానుందన్నారు. కార్యక్రమంలో స్వామినారాయణ్ ట్రస్ట్ అధ్యక్షుడు దేవ్ కృష్ణదా్‌సజీ స్వామీ జీ, ఉపాధ్యక్షుడు దేవ్‌ప్రసాద్ దాస్‌జీ స్వామి, ఇ.కె ఆధ్యాత్మిక సేవా సంస్థకుచెందిన జ్యోతిష్య మాస్టర్ నండూరి వెంకటవేణుమాధవ్, నిత్య స్వరూ్‌పస్వామి, ప్రేమ్‌కుమార్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జడ్పీవైస్ చైర్మన్ వెంకటనారాయణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివా్‌సగౌ డ్, అపూర్వ మేనేజింగ్ డైరెక్టర్లు కట్టా ప్రసన్నబాబు, ఆరోగ్యరె డ్డి, రమే్‌షనాయుడు, పందరి, సింగారెడ్డి శౌరిరెడ్డి, గోపు బాలరెడ్డి, గాదె చిన్నపరెడ్డి, మారంరెడ్డి థామ్‌సరెడ్డి, సి.ప్రభాకర్‌రావు, శివరాజ్‌పటేల్, చెరుకు సుధాకర్‌రెడ్డి, వేములపల్లి తేజ్‌తరుణ్, రాజ్‌వరుణ్, ఉప్పల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.