అన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌

ABN , First Publish Date - 2021-11-13T21:14:21+05:30 IST

చికెన్‌ బ్రెస్ట్‌ (సన్నటి ముక్కలు)-200 గ్రా, జొన్నపిండి - 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 5 గ్రా, కారం- 15 గ్రా, గరం మసాలా - 5 గ్రా, జీలకర్ర పొడి- 5గ్రా, ఉప్పు- తగినంత

అన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌

కావాల్సిన పదార్థాలు: నానబెట్టడం మరియు ఫ్రై కోసం...

చికెన్‌ బ్రెస్ట్‌ (సన్నటి ముక్కలు)-200 గ్రా, జొన్నపిండి - 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 5 గ్రా, కారం- 15 గ్రా, గరం మసాలా - 5 గ్రా, జీలకర్ర పొడి- 5గ్రా, ఉప్పు- తగినంత


కోడికారం పొడి కోసం...

చాట్‌ మసాలా - 25 గ్రా, ధనియాల పొడి - 25 గ్రా, జీలకర్ర పొడి- 25 గ్రా, కారం పొడి- 25 గ్రా


తయారీ విధానం: ఓ గిన్నెలో  నీరు తీసుకుని, మారినేషన్‌ కోసం  పైన వెల్లడించిన పదార్థాలన్నీ తీసుకుని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దలో చికెన్‌ కూడా కలిపి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఓ కడాయిలో నూనె తీసుకుని ఈ చికెన్‌ ముక్కలను వేసి బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించాలి. కోడికారం కోసం వెల్లడించిన పదార్థాలన్నీ తీసుకుని  గ్రైండింగ్‌  చేయాలి. ఈ కారాన్ని వేయించిన చికెన్‌ ముక్కలపై చల్లుకుని, వేయించిన కరివేపాకు జోడించి సర్వ్‌ చేసుకోవాలి.


ఇస్మాయిల్‌ 

ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ 

అన్నానేటివ్‌ సౌత్‌ ఇండియన్‌ ఫ్యూజన్‌ రెస్టారెంట్‌ 

సైనిక్‌పురి, హైదరాబాద్‌

Updated Date - 2021-11-13T21:14:21+05:30 IST