దమ్‌ కీ నల్లీ

ABN , First Publish Date - 2021-12-11T19:05:18+05:30 IST

హైదరాబాదీ అభిమాన డిష్‌లలో ఇదొకటి. నలుగురికి సరిపడా ఈ వంటకం తయారుచేసుకోవడానికి...

దమ్‌ కీ నల్లీ

హైదరాబాదీ అభిమాన డిష్‌లలో ఇదొకటి. నలుగురికి సరిపడా ఈ వంటకం తయారుచేసుకోవడానికి...


కావలసినవి: వంటనూనె - 50 మి.లీ, ఉల్లిపాయలు- అరకేజీ, యాలకులు - 4 గ్రా, లవంగాలు  నాలుగు గ్రా, బిర్యానీ ఆకు - 4గ్రా, సా జీరా- 4గ్రా, దాల్చిన చెక్క- 2 గ్రా, నల్లీ- ఒక కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 100గ్రా, కారం - 100 గ్రా, గరం మసాలా పొడి- 20 గ్రా, కుంకుమ పువ్వు- 1 గ్రా, టొమాటో ప్యూరీ - 350 గ్రా, మటన్‌ బోన్స్‌- రెండు కిలోలు, ఉప్పు- తగినంత.


తయారీ విధానం: ముందుగా ఓ కడాయిలో 2కేజీల మటన్‌ బోన్స్‌ను 2.5 లీటర్ల నీటిలో వేసి 1.5 లీటర్ల బోన్‌స్టాక్‌ వచ్చే వరకూ ఉడికించి,  ఆ నీటిని వేరే పాత్రలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాత్రలో నూనె, నెయ్యి వేిసి వేడి చేయాలి. దీనిలో దాల్చినచెక్క, యాలకులు వేసి వేయించాలి. అనంతరం ఉల్లిపాయలు వేసి గోధుమ రంగు వచ్చే వరకూ వేయించాలి. తరువాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా కలిపి గోధుమ రంగు వచ్చే వరకూ వేయించిన తరువాత లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా కలిపి ఓ నిమిషం ఉడికించాలి. ఇప్పుడు నల్లి జోడించి దానిలో తేమ పోయేంత వరకూ ఉంచి అనంతరం టొమాటో ప్యూరీ కలపాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బోన్‌స్టాక్‌ను వేసి ఓ సారి పూర్తిగా మరిగించి, ఆ తరువాత సిమ్‌లో నల్లి బాగా ఉడికేంత వరకూ ఉడికించాలి. ఆ తరువాత నల్లీ బయటకు తీసి, గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకూ ఉంచాలి. ఉప్పు తగినంత వేసు కోవాలి. ఇప్పుడు గ్రేవీలో మరలా నల్లీ జోడించాలి. అనంతరం గరంమసాలా, కుంకుమ పువ్వు తో అలంకరించుకుని, జీరా రైస్‌తో సర్వ్‌ చేసుకోవాలి.



Updated Date - 2021-12-11T19:05:18+05:30 IST