రైతుల అభివృద్ధి కోసమే నాబార్డు నిధులు : సీజీఎం
ABN , First Publish Date - 2022-09-09T05:06:43+05:30 IST
రైతులు అభివృద్ధి చెందడానికే నాబార్డు నిధులు మంజూరు చేస్తుందని నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్ పేర్కొన్నారు.

ముదిగుబ్బ, సెప్టెంబరు 8: రైతులు అభివృద్ధి చెందడానికే నాబార్డు నిధులు మంజూరు చేస్తుందని నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్ పేర్కొన్నారు. ముదిగుబ్బలో నాబార్డు నిధులతో సహాకారసొసైటీ గ్రామీణ రైతుసంత మార్కెట్‌ను ప్రారంభించారు. ఈకార్యక్రమానికి నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బనకట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సహాకారసొసైటీకి ఖాళీస్థలం ముదిగుబ్బలో ఎక్కువగా ఉండటంతో నాబార్డు గ్రామీణ రైతు సంత నిర్మించుకునేందుకు రూ.14.85లక్షల వ్యయంతో, సహాకారసొసైటీ నిధులు రూ.1.65లక్షల వ్యయంతో నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా సహాకార సొసైటీ బ్యాంకులో రైతులకు క్రాప్ రుణాలే కాకుండా గ్రూపురుణాలు కూడా పొందవచ్చున్నారు. త్వరలో పెట్రోల్‌బంకు, గదుల నిర్మాణం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం ఉషామధుసూదన, అప్కాబ్ జనరల్ మేనేజర్ హరిలాల్, సహకారసొసైటీ చైర్‌పర్సన లిఖిత, సీఈఓ రాంప్రసాద్, జీఎం సురేఖరాణి, ఏజీఎం దినే్‌షకుమార్, డీపీడీ దుర్గాప్రసాద్, నోడల్ ఆఫీసర్ ప్రసాద్, ఎంపీపీ ఆదినారాయణయాదవ్, ఇందుకూరు నారాయణరెడ్డి, బ్యాంకు మేనేజర్ గోపాల్, సీఈఓ శ్రీనివాసులు, ముదిగుబ్బ, రాళ్లఅనంతపురం, మారాల సొసైటీ అధ్యక్షులు బయపరెడ్డి, ఓబుల్‌రెడ్డి, రమణారెడ్డి, సిబ్బంది, మల్లికార్జున, కుమార్, బాబు, వైకుంఠవాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.