‘నాడు-నేడు’ పూర్తికి మరో నాలుగేళ్లు
ABN , First Publish Date - 2022-11-04T04:49:21+05:30 IST
పాఠశాలల్లో చేపట్టిన నాడు- నేడు పనుల పూర్తికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. ప్రస్తుతం 15 వేల పాఠశాలల్లో పథకం అమలయింది. ఈ ఏడాది మరో 22 వేల పాఠశాలల్లో, మిగిలినవి వచ్చే సంవత్సరం దశల వారీగా చేపడతాం. ఈ పనులన్నీ పూర్తయితే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరుగుతుంది’’

విద్యార్థుల సంఖ్య 37 నుంచి 42 లక్షలకి పెరిగింది: సీఎం జగన్
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘‘పాఠశాలల్లో చేపట్టిన నాడు- నేడు పనుల పూర్తికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. ప్రస్తుతం 15 వేల పాఠశాలల్లో పథకం అమలయింది. ఈ ఏడాది మరో 22 వేల పాఠశాలల్లో, మిగిలినవి వచ్చే సంవత్సరం దశల వారీగా చేపడతాం. ఈ పనులన్నీ పూర్తయితే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పాఠశాల విద్యాశాఖపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వం రాగానే పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేశాం. గతంలో క్లాస్ టీచర్‌కే అవకాశంలేని పరిస్థితుల నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సె్‌ప్టను తీసుకొచ్చాం. మూడు నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టు టీచర్ల కాన్సె్‌ప్టను పటిష్ఠంగా అమలు చేస్తున్నాం. 45 వేల పాఠశాలలను బాగుచేయాలంటే మూడు నాలుగేళ్లు పడుతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలల్లో 37 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 42 లక్షలకు పెరిగింది’’ అని జగన్ అన్నారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు.