Ambati Rambabu: పవన్ అంత మగాడా?
ABN , First Publish Date - 2022-12-28T15:50:30+05:30 IST
చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. జగన్ రెడ్డి (Cm jagan)ని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని సూచించారు. బుద్ధి.. జ్ఞానం లేని పవన్‌కల్యాణ్‌కు రాజకీయాలు ఏం తెలుసు
పల్నాడు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)పై మరోసారి మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్న పవన్ దగ్గర ఉంటారో.. జగన్ రెడ్డి (Cm jagan)ని నమ్ముకున్న అంబటి వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని సూచించారు. బుద్ధి.. జ్ఞానం లేని పవన్‌కల్యాణ్‌కు రాజకీయాలు ఏం తెలుసు అని ప్రశ్నించారు. వైసీపీ (ycp)ని మళ్లీ అధికారంలోకి రానివ్వను.. ఓట్లు చీలనివ్వను అంటాడు.. అంత పెద్ద మగాడా పవన్ అంటూ చెలరేగిపోయారు. కాపులంతా మా పవన్.. మా పవన్ అంటూ గోక్కుంటున్నారు. గోక్కుని.. గోక్కుని చంద్రబాబు (Chandrababu) దగ్గర పవన్‌తో కలిసి చాకిరి చేయండి అంటూ మండిపడ్డారు. ఒక్కచోట కూడా గెలవలేని పవన్ తనపై ఆరోపణలు చేస్తాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాళ్ల మీద పడి పవన్‌ను ఏడ్వమనండి అంటూ రుసరుసలాడారు. వైసీపీలో తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరు.. అందుకే తనను టార్గెట్ చేసుకొని పవన్ ఆరోపణలు చేస్తున్నాడంటూ ఫైరయ్యారు. కాపులను చంద్రబాబు దొడ్లో కట్టేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. తాను ఒక్కపైసా ఆశించానా? అయినా కూడా తనపైనే ఆరోపణలు చేస్తాడా..? అంటూ పవన్‌కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర పరుషపదజాలంతో ఊగిపోయారు.
ఇటీవల కుమారుడిని కోల్పోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల సాయం వస్తే.. దాంట్లో సగం అడిగారంటూ పవన్‌కల్యాణ్.. ఆ పార్టీ నేతలు బాధిత కుటుంబంతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టి మంత్రిపై విమర్శలు చేశారు. తాజాగా పవన్‌పై మీడియా వేదికగా అంబటి చేసిన వ్యాఖ్యలపై జనసేనాని, జనసైనికులు(Janasena) ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.