జనసేన పార్టీలో చేరికలు

ABN , First Publish Date - 2022-11-04T00:37:05+05:30 IST

పశ్చిమలోని 32వ డివిజన్‌ జనసేన పార్టీ అధ్యక్షుడు పి.కిరణ్‌ ఆధ్వర్యంలో డివిజన్‌లోని వివిధ పార్టీలకు చెందిన వారు గురువారం కొత్తపేట లోని జనసేన పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు పోతిన మహేశ్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

జనసేన పార్టీలో చేరికలు

జనసేన పార్టీలో చేరికలు

వన్‌టౌన్‌, నవంబరు 3: పశ్చిమలోని 32వ డివిజన్‌ జనసేన పార్టీ అధ్యక్షుడు పి.కిరణ్‌ ఆధ్వర్యంలో డివిజన్‌లోని వివిధ పార్టీలకు చెందిన వారు గురువారం కొత్తపేట లోని జనసేన పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు పోతిన మహేశ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్‌ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నాయకత్వం పటిమా, పార్టీ సిద్ధాంతాలు, భావజాలం వివిధ పార్టీలకు చెందిన పలువురు జనసేనలో చేరుతున్నట్లు తెలిపారు. జగన్మోహనరెడ్డి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను జనసైనికులు తిప్పి కొడతారన్నారు. సెంట్రల్‌ నాయకుడు బొల్లిశెట్టి వంశీ, నగర ఉపాధ్యక్షుడు వెన్న శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 6,7,8 తేదీల్లో చేపట్టిన రజకుల ఆత్మగౌరవ దీక్షకు సంఘీభావం తెలియజేయాల్సిందిగా రాష్ట్ర రజకుల సంఘం నాయకులు పోతిన మహేశ్‌ను కలిసి ఆహ్వానించారు. అనంతరం మహేశ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Updated Date - 2022-11-04T00:37:09+05:30 IST