అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-02-22T05:01:12+05:30 IST

అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని టౌన్‌ ప్లానింగ్‌ రీజినల్‌ డైరెక్టర్‌ మీనాకుమారి ఆదేశించారు. సోమవారం పురపాలకసంఘ కార్యాలయంలో చైర్మన్‌ బళ్ల గిరిబాబు అధ్యక్షతన సచివాలయ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారు లు, సిబ్బందితో సమీక్షించారు.

అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోండి
సిబ్బందితో మాట్లాడుతున్న ఆర్డీ మీనాకుమారి

 టౌన్‌ ప్లానింగ్‌ ఆర్డీ మీనాకుమారి 

పలాస: అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని టౌన్‌ ప్లానింగ్‌ రీజినల్‌ డైరెక్టర్‌ మీనాకుమారి ఆదేశించారు. సోమవారం పురపాలకసంఘ కార్యాలయంలో చైర్మన్‌ బళ్ల గిరిబాబు అధ్యక్షతన సచివాలయ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారు లు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జంట పట్టణాల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనధికార లేఅవుట్లలో  భవనాలకు అను మతులివ్వవద్దని సూచిం చారు. ఆదాయం పెంచేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. తొలుత  మంత్రి  అప్పలరాజుతో ఆర్‌డీటీపీ మీనాకుమారి, మునిసి పల్‌ చైర్మన్‌ గిరిబాబు సమావేశమయ్యారు.  

 

Updated Date - 2022-02-22T05:01:12+05:30 IST