ముస్లింలకు దుల్హన్ ఏదీ?
ABN , First Publish Date - 2022-12-19T23:59:56+05:30 IST
గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన దుల్హన్ పఽథకం ముస్లింలను ఎంతగానో ఉపయోగపడిందని టీడీపీ మైనార్టీ సెల్ నాయ కులు బాష, అనురాధ బేగం తదితరులు అన్నారు.

- టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు
విజయనగరం రూరల్: గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన దుల్హన్ పఽథకం ముస్లింలను ఎంతగానో ఉపయోగపడిందని టీడీపీ మైనార్టీ సెల్ నాయ కులు బాష, అనురాధ బేగం తదితరులు అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ముస్లింలతో కలిసి వారు విలేఖరులతో మాట్లాడారు. పాదయాత్ర సమయంలో జగన్ దుల్హన్ విషయంలో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం రూ.50 వేలు ఇస్తుందని, తాము అధికారంలోకి వస్తే రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారే తప్ప అమలు చేయడం లేదన్నారు. గతంలో ఇచ్చిన రూ.50 వేలు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్ తోఫాని ఎత్తివేశారన్నారు. ముస్లింల సంక్షేమం ఆటకెక్కిందన్నారు.