Electricity Bill: పూరి గుడిసెకు ఇంత కరెంట్ బిల్లేంటి జగనన్నా..!
ABN , First Publish Date - 2022-11-28T18:08:02+05:30 IST
విద్యుత్ శాఖ లీలలు సామాన్యులకు శాపంలా మారతున్నాయి. సిబ్బంది మీటర్ రీడింగ్ తప్పుగా తీయడంతో పేద వారి గుడిసెలకు విద్యుత్ సెగ అంటుకుంటోంది. వివరాల్లోకి వెళితే..
వేలేరుపాడు(పశ్చిమ గోదావరి జిల్లా): విద్యుత్ శాఖ లీలలు సామాన్యులకు శాపంలా మారతున్నాయి. సిబ్బంది మీటర్ రీడింగ్ తప్పుగా తీయడంతో పేద వారి గుడిసెలకు విద్యుత్ సెగ అంటుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. వేలేరుపాడు మండలం యడవల్లికి చెందిన పుంజా కన్నయ్యకు ఈ నెల కరెంటు బిల్లు రూ.10,160 వచ్చింది. అయితే ఈయన నివసించేది పూరి గుడిసెలో... కేవలం రెండు బల్బులు, ఒక ఫ్యాను మాత్రమే ఉన్నాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే ఈనెల కన్నయ్య వాడుకున్నది 21 యూనిట్లు మాత్రమే. దీనికి కనీసంగా రూ. 120కి మించి చార్జీ పడకూడదు. కానీ విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో వేలల్లో బిల్లు రావడంతో అతను గగ్గోలుపెడుతున్నాడు.