Tenali: అత్తమామలకి స్కూల్లో పిల్లలకి భోజనం పెట్టి వస్తానని చెప్పి వెళ్లిన కోడలు..

ABN , First Publish Date - 2022-12-12T12:28:53+05:30 IST

భర్త వ్యక్తిగత పనులపై బెంగుళూరుకి వెళ్ళగా ఇంట్లో అత్తమామలకి స్కూల్లోని పిల్లలకి భోజనం పెట్టి వస్తానని వెళ్ళిన వివాహిత ప్రియుడు ఇంట్లో ఉరివేసుకుని..

Tenali: అత్తమామలకి స్కూల్లో పిల్లలకి భోజనం పెట్టి వస్తానని చెప్పి వెళ్లిన కోడలు..

తెనాలి: భర్త వ్యక్తిగత పనులపై బెంగుళూరుకి వెళ్ళగా ఇంట్లో అత్తమామలకి స్కూల్లోని పిల్లలకి భోజనం పెట్టి వస్తానని వెళ్ళిన వివాహిత ప్రియుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలోని ఐతానగర్‌లో శనివారం జరిగింది. ఈ సంఘటనపై టూటౌన్‌ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాంధీనగర్‌ పయినీర్‌ అపార్టుమెంట్‌లో నివాసముండే పిన్నెల్లి గాయత్రి (33)కి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండు రోజుల క్రితం భర్త వ్యక్తిగత పనుల నిమిత్తం బెంగుళూరు వెళ్ళారు. ఇంట్లో అత్తమామలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం స్కూలుకు వెళ్ళిన పిల్లలకి భోజనం పెట్టి వస్తానని అత్తమామలకు చెప్పి ఐతానగర్‌లోని ఎలక్ర్టీషియన్‌, హాల్టింగ్‌ కారు డ్రైవర్‌గా పనిచేసే అవివాహితుడైన అంగలకుర్తి పవన్‌ (24) ఇంటికి వెళ్లింది. వీరి మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది.

గాయత్రి అతని ఇంటికి వెళ్ళే సమయంలో అతని తల్లీ ఇంట్లోనే ఉంది. గత కొన్ని రోజులుగా గాయత్రి ఫోన్‌ చేస్తున్నా పవన్‌ స్పందించకపోవడంతో ఈ విషయమై వారిద్దరి మధ్య వివాదం రేగింది. అది తీవ్రస్థాయికి చేరడంతో పవన్‌, అతని తల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. దీంతో ఆమె ఇంటి లోపలే గడి వేసుకుని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో పవన్‌ అతని తల్లి ఇంటి వెనుక భాగంలోని తలుపులు పగలకొట్టి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. స్థానికుల సాయంతో ఆమెను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త శివ ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-12T12:28:56+05:30 IST