Miss Fire: పోలీసు తుపాకీ మిస్‌ఫైర్.. మహిళకు గాయాలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:44 PM
సాధారణంగా పోలీసులకు తుపాకీ కాల్చడంలో శిక్షణ ఇచ్చే సమయంలో ఫైరింగ్ ప్రాంతంలో చుట్టు ప్రక్కల కొన్ని మీటర్ల పరిధిలో నిషేదిత ప్రాంతంగా పరిగణిస్తారు. పోలీసులకు శిక్షణ సమయంలో అటువైపు మనుషులు గాని, పశువులు గాని వెళ్ళకుండా జాగ్రత పడుతారు.

- ఆస్పత్రికి తరలింపు
బళ్లారి(బెంగళూరు): సాధారణంగా పోలీసులకు తుపాకీ కాల్చడంలో శిక్షణ ఇచ్చే సమయంలో ఫైరింగ్(Firing) ప్రాంతంలో చుట్టు ప్రక్కల కొన్ని మీటర్ల పరిధిలో నిషేదిత ప్రాంతంగా పరిగణిస్తారు. పోలీసులకు శిక్షణ సమయంలో అటువైపు మనుషులు గాని, పశువులు గాని వెళ్ళకుండా జాగ్రత పడుతారు. అయితే కొప్పళ తాలూకా పరిధిలోని జబ్బలగుడ్డ(కొండ) గ్రామం సమీపంలో కుమ్మటదుర్గ(Kummatadurga) వద్ద మంగళవారం డీఏఆర్ పోలీసులకు ఫైరింగ్ శిక్షణ ఇస్తున్న సమయంలో ఆకస్మికంగా మిస్ ఫైర్(Miss Fire) కావడంతో సమీపంలో పశువులు కాస్తున్న రేణుకమ్మ కబ్బేర అనే మహిళ భుజం వద్ద బుల్లెట్ దూసుకెళ్ళడంతో గాయపడింది. గట్టిగా అరుపులు వినబడడంతో పోలీసులు గాయపడిన మహిళను మునిరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తను కూడా చదవండి: అయ్యోపాపం ఎంతఘోరం జరిగిందో.. పాదయాత్రగా వెళ్తూ మృత్యు ఒడిలోకి..
ఈ వార్తను కూడా చదవండి: పదవుల కోసం పైరవీలు వద్దు
ఈ వార్తను కూడా చదవండి: సకల సదుపాయాలతో అర్బన్ పార్కులు
ఈ వార్తను కూడా చదవండి: ప్రజారోగ్యంపై పట్టింపేదీ!
ఈ వార్తను కూడా చదవండి: హాలియాలో పట్టపగలు దొంగల బీభత్సం
Read Latest Telangana News and National News