Kuwait: కువైత్‌లో తెరుచుకున్న 123 ప్రవాస పాఠశాలలు

ABN , First Publish Date - 2022-09-01T17:24:47+05:30 IST

కువైత్‌ (Kuwait)లో ఆదివారంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది.

Kuwait: కువైత్‌లో తెరుచుకున్న 123 ప్రవాస పాఠశాలలు

కువైత్ సిటీ: కువైత్‌ (Kuwait)లో ఆదివారంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దీంతో నిన్న ఆ దేశంలోని 123 ప్రవాస పాఠశాలలు (Expat schools) తిరిగి తెరుచుకున్నాయి. మొదటిరోజు సుమారు 1.65లక్షల మంది విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు. ఇక ఆదివారం తిరిగి ప్రారంభమైన విదేశీ స్కూళ్లలో బ్రిటిష్, అమెరికా, ఫ్రెంచ్, పాకిస్థాన్, ఫిలిప్పీన్, ఇండియన్ (Indian) పాఠశాలలు ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. కాగా, కువైత్ వ్యాప్తంగా మొత్తం 186 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే.. వీటిలో 123 విదేశీ పాఠశాలలు, 63 అరబిక్ లాంగ్వేజ్ స్కూళ్లు ఉన్నాయి. 


ఇక కువైత్‌లో ప్రభుత్వ పాఠశాలలు (Public Schools) సెప్టెంబర్ 25 నుంచి తిగిరి ప్రారంభం కానున్నాయి. అయితే, హై స్కూల్, ఇంటర్మిడియట్ విద్యార్థులు మాత్రం అక్టోబర్ 2 నుంచి తరగతులకు హాజరు కావాలని సంబంధిత అధికారులు వెల్లడించారు. విద్యా సంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 11 నుంచి 18 వరకు తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. ఈ మేరకు ఆ దేశ విద్యా మంత్రిత్వశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.   

Updated Date - 2022-09-01T17:24:47+05:30 IST