India-Serbia: భారతీయులకు భారీ షాక్.. కొత్త సంవత్సరం నుంచి ఆ దేశానికి వెళ్లాలంటే..
ABN , First Publish Date - 2022-12-26T11:08:40+05:30 IST
వీసా ఫ్రీ(Visa Free Entry) ఎంట్రీని ఉపసంహరించుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆదేశాలు కొత్త సంవత్సం నుంచి అందుబాటులోకి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. జనవరి 1 నుంచి సెర్బియాలో అడుగుపెట్టాలంటే..

ఎన్నారై డెస్క్: భారతీయులకు సెర్బియా ప్రభుత్వం భారీ(Serbia-India) షాకిచ్చింది. వీసా ఫ్రీ(Visa Free Entry) ఎంట్రీని ఉపసంహరించుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆదేశాలు కొత్త సంవత్సం నుంచి అందుబాటులోకి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. జనవరి 1 నుంచి సెర్బియాలో అడుగుపెట్టాలంటే ముందుగానే వీసా తీసుకోవాలని ఇండియన్స్‌కు సూచించింది. ‘పాస్‌పోర్ట్(India Passport) కలిగిన భారతీయులు వీసా(No Visa Free Entry) లేకుండా దాదాపు 30 రోజుల వరకు సెర్బియాలో నివాసం ఉండగలిగేలా గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది’ అని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.
ఈ నేపథ్యంలో సెర్బియాలోని ఇండియన్ ఎంబసీ భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. సెర్బియా ప్రభుత్వ(Serbia Govt) ఆదేశాల ప్రకారం.. జనవరి 1 నుంచి సెర్బియాకు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్న భారతీయులు ఇండియాలోని సెర్బియా ఎంబసీల ద్వారా ముందుగా వీసాలు పొందాలని సూచించింది. ఇదిలా ఉంటే.. యూకే(UK), అమెరికా(America) దేశాలకు సంబంధించిన వీసాలు కలిగిన భారతీయులు సెర్బియా వీసా తీసుకోకుండానే ఆ దేశంలో దాదాపు 90 రోజుల వరకు నివాసం ఉండొచ్చు.