రోహిత్, సైనీ అవుట్
ABN , First Publish Date - 2022-12-20T23:52:11+05:30 IST
గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా
బంగ్లాతో రెండో టెస్ట్
మిర్పూర్: గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా రోహిత్ బొటన వేలికి దెబ్బ తగిలింది. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐ తెలిపింది. పేసర్ నవ్‌దీప్ సైనీకి కూడా ఉదర కండర గాయం కావడంతో.. అతడు కూడా రెండో టెస్ట్ నుంచి అవుటయ్యాడు.