PFI Case: నిజామాబాద్ పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ చార్జ్‌షీట్
ABN , First Publish Date - 2022-12-30T12:50:35+05:30 IST
నిజామాబాద్ పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేసింది. నిజామాబాద్‌లో పీఎఫ్ఐపై నమోదైన కేసు ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది.
హైదరాబాద్: నిజామాబాద్ పీఎఫ్ఐ కేసు (Nizamabad PFI Case)లో ఎన్ఐఏ చార్జీషీట్ (NIA ChargeSheet) దాఖలు చేసింది. నిజామాబాద్‌లో పీఎఫ్ఐపై నమోదైన కేసు ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. 11 మంది నిందితులపై ఎన్ఐఏ నేరారోపణలు మోపింది. నిందితులపై 120బీ, 153ఏ, యూఏ(పీ) 17,18,18A, 18బీ సెక్షన్లు కింద కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురిపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. శిబిర నిర్వహికుడు అబ్దుల్ ఖాదర్‌తో పాటు మరో 10 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. ముస్లిం యువకులను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వము, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలను పీఎఫ్ఐ చేస్తున్నట్లు ఎన్ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ముస్లిం యువకులను పీఎఫ్ఐ సంస్థలో బలవంతంగా చేర్చుకున్నట్లు తెలిపింది.
పీఎఫ్ఐలో రిక్రూట్ అయిన తర్వాత ముస్లిం యువకులను యోగా క్లాసులు, ఫిజికల్ ఎడ్యుకేషన్, బిగినర్స్ కోర్సు ముసుగులో దాడులపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించింది. ఉగ్రవాద సాహిత్యంతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. సున్నిత ప్రాంతంలో ఏవిధంగా దాడులు చేయాలో పీఎఫ్ఐ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించింది. అలాగే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎన్ఐఏ గుర్తించింది. దేశ వ్యాప్తంగా దాడులు చేసి పలువురిని ఎన్ఐఏ విచారించింది. పీఎఫ్ఐ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని ఎన్ఐఏ స్పష్టం చేసింది. కాగా.. ఇప్పటికే పీఎఫ్ఐ సంస్థను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.