Swamy Goud: బీజేపీ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు చేయడం సరికాదు..
ABN , First Publish Date - 2022-10-31T11:42:31+05:30 IST
బీజేపీ నాయకులు (BJP Leaders) ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ (Swamy Goud) అన్నారు.

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ నాయకులు (BJP Leaders) ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ (Swamy Goud) అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీ
డియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకుల మాటల వల్ల ఉద్యోగుల మనసులు గాయపడుతున్నాయన్నారు. మేము అమ్ముడు పోయి ఉంటే ఆనాడు ఉద్యోగమంలో ఉండే వాళ్ళం కాదన్నారు. ఉద్యోగులపై దాడులు జరిగినప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి పొరుయాత్ర చేస్తే ఉద్యోగులు ప్రతిజిల్లాలో పాల్గొనలేదా? అని అన్నారు. స్వార్థం కోసం తెలంగాణ ఎన్‌జీవో (NGO) సంఘం, ఉద్యోగ సంఘాలు ఎక్కడా, ఎవరికి అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వంలోనైనా ఆయా పార్టీల భావజాలలు ఉన్న రన్నింగ్ ఉద్యోగులు ఉంటారని, ఉద్యోగుల్లో అన్ని పార్టీల భావాలు ఉన్న వాళ్లు ఉంటారన్నారు. ఉద్యోగులను కొనే శక్తి ఎవరికి లేదన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను దూరం చేసుకునే మాటలు మాట్లాడుతోందని, మనసులు గాయపడే విమర్శలు చేయొద్దని స్వామిగౌడ్ కోరారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ..
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగులకు వీరోచిత చరిత్ర ఉందని, తెలంగాణ కోసం ఏ పార్టీ ముందుకు వచ్చినా ఆ పార్టీతో కలిసి పనిచేస్తామని స్పస్టం చేశారు. ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉద్యమంలో రెండు పార్టీలకు వ్యతిరేకంగా పనిచేశామన్నారు. ప్రధాని మోదీ ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయని, పరిష్కారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉద్యోగులు అమ్ముడు పోయారని అంటున్నారు.. ఎవరు అమ్ముడు పోయారో చెప్పాలని దేవిశ్రీప్రసాద్ డిమాండ్ చేశారు.