పేదల ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-12-21T23:20:33+05:30 IST

తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా నిరుపేదలు ఇంటి నిర్మాణం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్‌ఎండీ.ఫయాజ్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

పేదల ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలి
కొల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

కొల్లాపూర్‌, డిసెంబరు 21 : తెలంగాణ రాష్ట్ర వ్యా ప్తంగా నిరుపేదలు ఇంటి నిర్మాణం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్‌ఎండీ.ఫయాజ్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కొల్లాపూర్‌ సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక తహసీ ల్దార్‌ కార్యాలయం ముందు సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడు తూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తం గా పేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం వాగ్దానాన్ని విస్మరించిందని, కనీసం అర్హత కలిగిన అందరికీ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేం దుకు 5లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ రమేష్‌నాయక్‌కు అందజేశారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆర్‌.ఇందిరా, సీపీఐ జిల్లా నాయకులు కుర్మయ్య, సింగోటం సర్పంచ్‌ మండ్ల లాలీ, సీపీఐ పట్టణ కార్యదర్శి ఎండి.యూసుఫ్‌, కార్యదర్శి బి.వెంకటస్వామి, నాయకులు ఇటుకల కుర్మయ్య, విజయ్‌, ఖాదర్‌, లక్ష్మీ, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-21T23:20:34+05:30 IST