Shasidhar Reddy: బీజేపీ గూటికి శశిధర్‌రెడ్డి.. చేరిక తర్వాత కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-11-25T16:18:56+05:30 IST
మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి (Shasidhar Reddy) బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్‌రెడ్డి (Kishan Reddy) సమక్షంలో శశిధర్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు.

హైదరాబాద్: మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి (Shasidhar Reddy) బీజేపీలో (BJP) చేరారు. కేంద్రమంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్‌రెడ్డి (Kishan Reddy) సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ (TRS)ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదని తేల్చిచెప్పారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి నిలిచిపోయిందని, తెలంగాణలో కుటుంబపాలన కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణ కంటే కుటుంబ ప్రయోజనాలకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యమని శశిధర్రెడ్డి దుయ్యబట్టారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)ను కలిసిన శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ బహిష్కరించింది. ఆ తరువాత రెండు రోజులకే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన శశిధర్‌రెడ్డి... కాంగ్రెస్ నేతలపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ విప్ ఈరవత్రి అనిల్ డిమాండ్ చేశారు. లేదంటే పరువునష్టం కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని గురువారం శశిధర్ రెడ్డికి ఆయన లీగల్ నోటీస్ కూడా పంపారు.