Munugode Live: మునుగోడులో ముగిసిన పోలింగ్

ABN , First Publish Date - 2022-11-01T17:02:50+05:30 IST

అధికార టీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా.... హోరాహోరీ ప్రచారం మధ్య సాగిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య నవంబర్ 6వ తేదీన వాస్తవ ఫలితాలు వెల్లడి కానున్నాయి....

Munugode Live: మునుగోడులో ముగిసిన పోలింగ్
ప్రతీకాత్మక చిత్రం

మునుగోడు ఉప ఎన్నిక- మినిట్ టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్

7:05 pm: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికీ చాలా పోలింగ్ కేంద్రాల్లో భారీ ‘క్యూ’ లైన్లు కనిపిస్తున్నాయని.. ‘క్యూ’లో ఉన్న ఓటర్లందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఎక్కడా రీపోలింగ్ అవసరం రాకపోవచ్చని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ అభిప్రాయపడ్డారు.

7:00 pm: మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలంలోని బంగారి గడ్డలో ఓటరు చైతన్యo పోటెత్తింది. సాయంత్రం 4 గంటలకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 1,000 మంది ‘క్యూ’లో నిల్చొని ఉన్నారు. రాత్రి 8 గంటలకు గానీ పోలింగ్ ముగిసేలా లేదు. బంగారి గడ్డ గ్రామంలో హైదరాబాద్‌లో స్థిరపడ్డ వారు ఎక్కువగా ఉన్నారు. వారంతా వివిధ కారణాలతో మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో ఒక్కసారిగా ‘క్యూ’ పెరిగింది. ఈ ఒక్క చోటే కాదు మునుగోడు నియోజకవర్గంలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటలకు ముగిసినప్పటికీ ‘క్యూ’ లైన్లలో భారీగా ఓటర్లు కనిపించారు. దీంతో.. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలింగ్ ముగియాలంటే రాత్రి 8 గంటలు దాటేలానే ఉంది.

munugode-voters.jpg

6:57 pm: మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ ముగియడంతో EVM బాక్సులు సీజ్ చేసిన అధికారులు

munugode123.jpg

6:40 pm: మునుగోడు ఉప ఎన్నికలో యువ ఓటర్లు కదం తొక్కారు. తొలిసారి ఓటు హక్కు పొందిన యువతులు కూడా ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

munugode12.jpg

6:30 pm: మునుగోడులో టీఆర్ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పోలింగ్ ముగిశాక మీడియాతో మాట్లాడుతూ.. చెప్పిన మాట వినాలంటూ అధికారులను టీఆర్ఎస్‌ నేతలు బెదిరించారని, ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీనే గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

bandi-sanjay1.jpg

6:20 pm: మునుగోడు పట్టణంలో పోలింగ్ సమయం దాటిన తరువాత వచ్చిన ఓటర్లు. వెనక్కి పంపిన పోలీసులు

munugode1.jpg

6:05 pm: మునుగోడులో ముగిసిన పోలింగ్ సమయం.. ఇప్పటికీ చాలా పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరిన ఓటర్లు.. ‘క్యూ’లో నిల్చున్న వారికి ఆలస్యమైనా ఓటు వినియోగించుకునే అవకాశం ఇవ్వనున్న ఎన్నికల సంఘం.. సాయంత్రం 5 గంటల వరకూ 77.55 శాతం పోలింగ్ నమోదు. పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ రికార్డు స్థాయిలో 90 శాతం దాటే ఛాన్స్.

munugodu-polling.jpg

5:57 pm: సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగుస్తున్నప్పటికీ చౌటుప్పల్ మండలంలో ఓట్లరు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చౌటుప్పల్ మండలంలో సాయంత్రం 5.00 గంటల వరకూ రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. చౌటుప్పల్ మండలంలో మొత్తం 59,433 మంది ఓటర్లు ఉండగా.. 47,496 ఓట్లు సాయంత్రం 5.00 గంటల లోపే పోలయ్యాయి. 79.91 శాతం ఓటింగ్ అప్పటికే నమోదైంది.

voters.jpg

5:40 pm: డబ్బులు తమకు ఎందుకు పంచలేదని పోలింగ్ బూత్‌లో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని శివన్న గూడెం గ్రామస్తులు అడ్డుకుని నిలదీశారు. డబ్బులు పట్టుకుంటున్నారు కాబట్టే పంచలేకపోయానని రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పారు.

komati-reddy.jpg

5:15 pm: మునుగోడు ఉప ఎన్నిక క్లైమ్యాక్స్‌కు చేరుకుంది. పోలింగ్ ముగియడానికి గంట కూడా లేకపోవడంతో చివరి నిమిషంలో ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల సమయానికి 77.55 శాతం ఓటింగ్ నమోదైంది. మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,41,805 కాగా.. 5 గంటల సమయానికి 1,87,527 ఓట్లు పోలయ్యాయి.

5:00 pm: మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేఏ పాల్‌తో నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మునుగోడు జిల్లా పరిషత్ హైస్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కేఏ పాల్‌ను పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్లాలని పోలింగ్ సిబ్బంది హెచ్చరించారు. సిబ్బందిని పోలింగ్ ప్రక్రియ వివరాలు అడిగితే సమాధానం చెప్పకపోగా తనను బయటకు గెంటేశారని కేఏపాల్ చెప్పారు. పోలింగ్ సిబ్బంది తీరుపై కేఏ పాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

paul.jpg

4:40 pm: మర్రిగూడ మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ దగ్గరకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. మర్రిగూడ మండల కేంద్రంలో ఉదయం లాఠీచార్జ్ ఎందుకు చేశారని డీఎస్పీని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా బీజేపీ కార్యకర్తలు కూడా చేరుకోవడంతో డీఎస్పీ ఆయనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

komati-reddy-venkat-reddy.jpg

4: 30 pm: మునుగోడులో సాయంత్రం 3 గంటల వరకు మండలాల వారీగా నమోదయిన పోలింగ్ వివరాలు..

* చండూరు: 55.35%

* చౌటుప్పల్: 60.26%

* గట్టుప్పల్: 52.30%

* మర్రిగూడ: 56.47%

* మునుగోడు: 62.20%

* నాంపల్లి: 62.94%

* నారాయణపూర్: 64.21%

4:10 pm: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 94,96,బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. చాలాసేపటి నుంచి ఓటర్లు బారులు తీరిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉండటంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

3:40 pm: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోని నారాయణపురం మండలంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈ మండలంలో అత్యధికంగా మొత్తం 36,430 మంది ఓటర్లుండగా.. మధ్యాహ్నం 3 గంటల సమయానికే 21,818 ఓట్లు పోలయ్యాయి. నారాయణపురం మండలంలో 59.89% పోలింగ్ నమోదు కావడంతో పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఈ మండలంలో భారీ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

e90afb58-20c3-41fd-bb8a-da9a7d44833b.jfif

3.30 PM: నాంపల్లి మండలంలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 58% పోలింగ్ నమోదైంది. ఈ మండలంలో మొత్తం 31 గ్రామాలుండగా 43 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.

cfe248fe-ea79-46ef-be66-f30b3f43b8e1.jfif

3:25 pm: చౌటుప్పల మండలంలో మధ్యాహ్నం 3:00 గంటల వరకు 60.06 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మండలంలో మొత్తం 59,433 ఓటర్లు ఉండగా... ఇప్పటి వరకు 35,698 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

3:18 pm: మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మునుగోడులో మొత్తం 241805 ఓట్లు ఉండగా... ఇప్పటి వరకు 144878 ఓట్లు పోలయ్యాయి.

3:00 pm : టీఆర్ఎస్ నేత బొడిగె వెంకటేశం ఇంటి వద్ద భారీగా నగదు, మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గట్టుపల్లి మండల కేంద్రంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బొడిగె వెంకటేశం నివాసం వద్ద మోడల్ కోడ్ కండక్టర్ టీం తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో రూ. 2.93 లక్షల నగదు, రూ.5,700 విలువైన మద్యం పట్టుబడింది.

gattupalli-money.jpg

2:45 pm: నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలో టీఆర్ఎస్ ఎంపీకి చెందిన కారులో మద్యం పట్టుబడింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇన్‌చార్జ్ గ్రామమైన దామర భీమనపల్లి గ్రామంలో బీజేపీ శ్రేణులు ఈ మద్యాన్ని పట్టుకున్నారు.

marrigudem-madyam.jpg

2:40 pm: మునుగోడులో మొత్తం ఓట్ల సంఖ్య 2,41,805 కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 99,780 ఓట్లు పోలయ్యాయి. 41.3 శాతం పోలింగ్ నమోదైంది.

19fc716e-000a-4c46-a8a3-86d9eb331411.jpg

2:28 pm : నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం రంగం తండాలో గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని... సమస్యలను అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయమని హెచ్చరించారు. రంగం తండాలో మొత్తం 320 ఓట్లు ఉన్నాయి.

ranga-tanda.jpg

1:57 pm: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. శివన్నగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎక్కువగా ఉండటంతో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపని పరిస్థితి. ఇప్పటి వరకు 33% పోలింగ్ నమోదైనట్లు ప్రొసీడింగ్ ఆఫీసర్ తెలిపారు.

shivannagudem.jpg

01:45 pm: మునుగోడులో పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ రెమా రాజేశ్వరి

01:44 pm: చౌటుప్పల్‌ మండలంలో ఈవీఎం మొరాయించింది. దీంతో.. చిన్నకొండూరు పోలింగ్‌ సెంటర్‌లో పోలింగ్‌ నిలిచిపోయింది. పోలింగ్‌ కేంద్రంలోనే ఓటర్లు ఓపికతో బారులు తీరారు.

01:15 pm: మునుగోడు ఉప ఎన్నికలో మధ్యాహ్నం 01:00 గంట సమయానికి 41.3 శాతం పోలింగ్ నమోదు.. ఉదయంతో పోల్చితే మధ్యాహ్నానికి పెరిగిన పోలింగ్ శాతం.. సాయంత్రానికి పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగే అవకాశం

1:00 pm: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులో టిఆర్ఎస్ కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. పోలింగ్ కేంద్రం దగ్గర్లో బీజేపీ నాయకులు కూర్చున్న పట్టించుకోవడంలేదని, తమను మాత్రం పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉండాలని పోలీసులు బెదిరిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

munugode2.jpg

12:56 pm: మునుగోడు ఉప ఎన్నికలో మూడుచోట్ల ఈవీఎంలు మార్చి పోలింగ్‌ కొనసాగిస్తున్నామని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఒక పోలింగ్‌ కేంద్రంలో వీవీప్యాట్‌ సమస్య వస్తే మార్చామని, మరో కేంద్రంలో ఈవీఎం సమస్యను పరిష్కరించామని సీఈవో వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికపై 28 ఫిర్యాదులు వచ్చాయని, రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు రూ.2.99 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, 2018లో 91 శాతం పోలింగ్‌ నమోదైందని సీఈవో వికాస్‌రాజ్‌ గుర్తుచేశారు.

munugode1.jpg

12:15 pm: నాంపల్లి మండలంలో అన్ని బూత్ లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 31 గ్రామాలు. 31 గ్రామ పంచాయితీలకు - 11 మంది ఎంపీటీసీలు ఉన్నారు. నాంపల్లి మండల వ్యాప్తంగా 43 పోలింగ్ బూత్‎లు ఏర్పాటు చేశారు. దాదాపు ఇప్పటివరకు అత్యధికంగా వృద్ధులు, మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాంపల్లిలో మొత్తం 3వేలకు పైగా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

munugode.jpg

(మునుగోడు ఉప ఎన్నిక ఫొటోల కోసం క్లిక్ చేయండి)

12:00 pm: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో బూత్ నెంబర్ 96లో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

karne-prabhakar.jpg

11:58 am: మునుగోడ్ మండలం గూడపూర్ గ్రామంలో పోలింగ్ కేంద్రం నెంబర్ 93/162 గూడపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిలుచున్న ఓటర్లు

mpup.jpg

11:48 am: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అంతంపేట గ్రామంలో ఓటర్లు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బులు, టీఆర్ఎస్ పార్టీ వాళ్లకే పంచారని, బీజేపీ పార్టీ డబ్బులు ఆపారని ఆందోళన చేస్తున్నారు. మాకెందుకు రాకుండా చేశారని ఓటర్లు మండిపడుతున్నారు. మా డబ్బులు ఆపివేసినందుకు మేము కాంగ్రెస్ పార్టీ మహిళ అభ్యర్థికే ఓటు వేస్తామని అంతంపేట గ్రామస్తులు ఎలక్షన్ వెళ్లకుండా బహిష్కరించారు.

565.jpg

11:30 am: మునుగోడులో 2014, 2018 ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు పోలైన ఓట్ల లెక్క ఇది..

Munugode1.jpg

11:25 am: మర్రిగూడ మండలం భీమనపల్లిలో నెంబర్ ప్లేట్ లేని కారులో మద్యం,డబ్బులు తరలిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తను బీజేపీ శ్రేణులు పట్టుకున్నారు. కార్యకర్తను అరెస్ట్ చేసి పోలీసులకు అప్పజెప్పారు.

11: 15 am: మునుగోడు ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల సమయానికి 25.8 శాతం ఓటింగ్ నమోదైంది.

11:00 am: నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలోని లెనిన్ కాలనీలో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుండి మాకు డబ్బులు అందలేదని మొదటి నుండి తులం బంగారం లేదా ఓటుకు రూ.30 నుండి 40 వేలు ఇస్తారని ఆశపెట్టారని, ఇప్పుడు కనీసం డబ్బులు కూడా నాయకులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు డబ్బులు ఇవ్వని పక్షంలో మేము ఓటు ఎవరికి వేయమని నిరసన తెలుపుతున్నారు.

10:48 am: నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం అంతంపేట, సోమరాజు గూడ గ్రామానికి చెందిన 15 మంది ఓటర్లు బొంబాయిలోని ఆదానీ గ్రూపులో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వారు ఓటు వేయడానికి రావాలని ఓటుకు రూ.3000తో పాటు అదనంగా బస్సు చార్జీలు ఇస్తామని చెప్పడంతో వచ్చామని, మేము వచ్చి నాలుగు రోజులు అయినా.. ఇంతవరకు మమ్మల్ని పిలిపించిన వారు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇష్టముంటే వచ్చేవారం లేకపోతే లేదు ఎందుకు మమ్మల్ని డబ్బులు ఇస్తామని ఆశ చూపించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Untitled-11555.jpg

10:38 am: మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ చేతికి ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్న మీరు ఇలా ఐదు వేళ్లకు ఐదు ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించినట్లు కాదా అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. టీఆర్‌ఎస్ నేతలు బయట ముప్పై వేల మంది కార్లలో తిరుగుతున్నారు. వాళ్లు కూడా కార్లలో కాకుండా సైకిల్ మీద వస్తారా అని కేఏ పాల్ ప్రశ్నించారు.

KA-Paul.jpg

10:32 am: మర్రిగూడ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జీ చేశారు. ఘర్షణ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఆంక్షలు విధించారు. 100 మీటర్ల నుండి 200 మీటర్లకి పొడిగించారు. పోలింగ్ స్టేషన్‎కి 200 మీటర్ల దూరంలో ఉన్న షాపులను అధికారులు మూసివేయిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీస్ అధికారులు తెలిపారు.

10:30 am: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లిలో కారులో రూ.500 నోట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్‎కి చెందిన వాహనంలో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు బీజేపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో ఉన్న రూ.10 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకుని టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Untitled-10545.jpg

10:22 am: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో సర్వేల పేరుతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నవారిని టీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. బీజేపీకి ప్రచారం చేస్తున్న వ్యక్తులను పోలీసులకు అప్పగించారు.

10:18 am: చండూరు మండలం కొండాపురంలో 178 బూత్‎లో గంటసేపటి నుంచి ఈవీఎం మొరాయిస్తోంది. దీంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు ఓటు వినియోగించుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు. అధికారులు ఈవీఎం సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

10:15 am: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని అల్లందేవి చెరువులో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అధికారులు ఈవీఎంల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు బారులు తీరారు.

10:12 am: మునుగోడు ఉప ఎన్నికపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్. దుబ్బాక తరహాలోనే మునుగోడులో ఫేక్ పార్టీ (బీజేపీ) సోషల్ మీడియాలో బరితెగించింది. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ స్రవంతిపై మార్పింగ్ ఫోటోలతో దుష్ఫ్రచారం చేస్తోంది. తమ ఓటమి ఖాయం అన్న భయం ఉన్న వాళ్లే ఇలాంటి నీచానికి దిగజారుతారు.

fake-original.jpg

10:00 am: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురాం మండల కేంద్రంలో ఉన్న పోలింగ్ బూత్‌లను పరిశీలిస్తున్న స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్. పరుగులు తీసుకుంటూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి అక్కడ పరిస్థితులను తెలుసుకొని మళ్ళీ పరుగు తీసుకుంటూ బయటికి వెళ్లిపోయిన కేఏ పాల్.

ab00041b-e6ff-496f-938c-72f56a94696a.jfif2b1e4b61-9763-4d06-96d0-294647c8b3a7.jfif6376cc2e-514b-45b9-b975-4126c7826344.jfif

9:54 am : మర్రిగూడలో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇతర జిల్లాల టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. స్థానికేతరులు మర్రిగూడలో ఉన్నారని చెప్పినా పట్టించుకోవడం లేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

9:50am : మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో బూత్ నెంబర్ 145లో గంట నుంచి ఈవీఎం మొరాయిస్తోంది. దీంతో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు తీవ్ర అసహనాన్ని గురవుతున్నారు.

9:42 am : చండూరు మండలం తాస్కాని గూడెంలో చిన్న పిల్లల చేత అధికార పార్టీ పోలింగ్ సెంటర్ వద్ద ప్రచారం చేయిస్తోంది.

9:30 am: మునుగోడు ఉప ఎన్నిక.. ఉదయం 09:30 సమయానికి 11 శాతం పోలింగ్ నమోదు

9: 29 am : చండూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికేతరులు ఓ ఇంట్లో ఉన్నారంటూ బీజేపీ నేతలు వారిని తరిమి కొట్టారు. అయితే బీజేపీ వాళ్లు కూడా ఉన్నారంటూ టీఆర్‌‌ఎస్ కార్యకర్తలు...కమలం పార్టీ నేతలతో వాగ్వాదానికి దిగారు.

9: 15am : నారాయణపురం మండలం జనగాం గ్రామంలో బిఎస్‎పి అభ్యర్థి అందోజు శంకరాచారి సతీమణి కీర్తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

9: 00 am: మెదక్, సిద్దిపేట టిఆర్ఎస్ కార్యకర్తలు స్థానికంగా తిష్ట వేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మర్రిగూడ మండల కేంద్రంలో బిజెపి కార్యకర్తలు ఆందోళన దిగారు. దీంతో పోలీంగ్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Munugode.jpg

8.45 am: మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో ఉపఎన్నిక పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకు 10% పోలింగ్ నమోదైంది.

telanagana-cex.jpg

8.32 am: యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలం లింగవారి గూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సతీమణి అరుణ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

kusukuntla.jpg

8.25 am: మునుగోడులోని హైస్కూల్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‎ను బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు.

8.20 am: నాంపల్లి మండలం కేంద్రంలోని జడ్పీ హై స్కూల్‎లో 294 పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు ఈవీఎంల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

08:00 am: మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోల్ పూర్తయింది.

07: 45 am: ఉదయం 8:00 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించనున్న బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మొదటగా అనంతరం నాంపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలని పరిశీలిస్తారు.

07:40 am: నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ లోని పోలింగ్ కేంద్రం 173లో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి

sravanthi.jpg

07:30 am: మర్రిగూడ లో ప్రారంభమైన పోలింగ్

07:15 am: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం

లింగవారి గూడెంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు ప్రారంభమైన పోలింగ్

07:00 am: ప్రారంభమైన మునుగోడు పోలింగ్


నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక (Munugode ByPoll) పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నికకు (Telangana By Election) సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్‌ రాజ్‌ వివరించారు. మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలకు (Munugode Polling) గాను అర్బన్‌ పరిధిలో 35, రూరల్‌ పరిధిలో 263 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే కొత్తగా ఓటు హక్కు పొందినవారికి తొలిసారిగా ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులను మంజూరుచేశారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులను పంపిణీ చేశామని, ఇంకా అందనివారు ఆన్‌లైన్‌ ద్వారా పొందొచ్చని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. అదే విధంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇక మునుగోడు (Munugodu) పరిధిలో మొత్తం 2.41 లక్షల మంది ఓటర్లుండగా (Munugode Voters)... వారిలో 50 మంది సర్వీసు ఓటర్లు, 2576 మంది 80 ఏళ్లు దాటినవారు ఉన్నట్లు తెలిపారు.

కాగా.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు 5,686 మందికిగాను 730 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరగనుందని, మాక్‌ పోలింగ్‌ దృష్ట్యా గంట ముందుగానే ఏజెంట్లు రావాలని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ముగ్గురు ఇతర ఆఫీసర్లు ఉంటారన్నారు. మొత్తం 1,192 మంది సిబ్బంది అవసరం కాగా.. 300 మందిని అదనంగా ఏర్పాటుచేశామన్నారు. వీరితోపాటు 199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారని, ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు ఉంటారని, అన్నిచోట్లా మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఈవో వివరించారు. ఓటర్ల నుంచి ఫిర్యాదుల కోసం సి-విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. నేరుగా పోలింగ్‌ కేంద్రం నుంచే గంటకోసారి ఓటింగ్‌ శాతం నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2022-11-03T19:32:30+05:30 IST
Read more