Raghunatha Reddy: ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలి
ABN, First Publish Date - 2023-10-01T21:55:44+05:30
ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి (Raghunatha Reddy) వ్యాఖ్యానించారు.
శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి(Raghunatha Reddy) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం నాడు పుట్టపర్తి మండలం నిడిమామిడి నుంచి గంట్ల మారెమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. నేతలకు అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే బాబు రావాలని.. రాష్ట్రం నాశనం కావాలంటే జగన్ రావాలని పెద్ద పెట్టున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. రాష్ట్రానికి ఆమరావతి రాజధాని కావాలన్నా, అభివృద్ది చెందాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి’’ అని పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-10-01T21:55:44+05:30 IST