Ramakrishna: జగన్‌రెడ్డి చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలి: రామకృష్ణ
ABN, First Publish Date - 2023-09-27T22:12:00+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకుని... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) వ్యాఖ్యానించారు.
అనంతపురం: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకుని... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ బుధవారం నాడు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కాగడాల ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా వేలాదిగా కాగడాల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ...‘‘ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ... కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును జైల్లో పెట్టాడని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. జగన్మోహన్‌రెడ్డి చేసిన తప్పును సరిదిద్దుకుని... చంద్రబాబును బేషరతుగా విడుదల చేయాలి. జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతాం. నారా లోకేష్‌పై కేసులు పెడితే మరింత బూమ్ రాంగ్ అవుతుంది. ఎవరు తప్పు చేసినా విచారించి కేసులు పెట్టాలి... ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా భయభ్రాంతులకు గురిచేసి అరెస్ట్ చేస్తున్నారు. చట్టాలను ఇష్టానుసారం చేతుల్లోకి తీసుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై అనవసరంగా కేసులు బనాయిస్తున్నారు’’ అని రామకృష్ణ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-27T22:12:00+05:30 IST