Purandeshwari: మేము ప్రశ్నిస్తే చంద్రబాబుపై కేసు పెడతారా?
ABN, First Publish Date - 2023-11-03T09:29:28+05:30
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.
చిత్తూరు: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపైన (TDP Chief Chandrababu Naidu) కేసులు కడుతున్నారన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. మిగిలిన పొత్తులు సాధారణంగా ఎన్నికలు రెండు నెలలు ముందు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రాక్టర్లు పెద్దపెద్ద జేసీబీలతో నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు తమ పార్టీ నిజమైన సామాజిక న్యాయం చేస్తోందని.. సబకే సాత్, సబకే వికాస్‌తో ముందుకెళ్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు.
Updated Date - 2023-11-03T10:14:10+05:30 IST